Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 74948
      [news_title_telugu_html] => 

ఆనందంగా పెంచేద్దాం!

[news_title_telugu] => ఆనందంగా పెంచేద్దాం! [news_title_english] => [news_short_description] => స్మార్ట్ కిడ్స్‌’ను తయారు చేయడంలో, ‘సక్సెస్‌ఫుల్‌ కిడ్స్‌’ను సృష్టించటంలో మునిగిపోయిన మనం నిజంగా పిల్లలు ఆనందంగా, సంతోషంగా ఉండేలా పెంచుతున్నామా? అత్యాధునిక సౌకర్యాల మాటున పిల్లలకు అన్నీ ఇచ్చేస్తున్నామన్న భావనలో మునిగిపోతున్న తరుణంలో ఇది మనమంతా వేసుకోవాల్సిన ప్రశ్న. [news_tags_keywords] => Smart kids, Self confidence, Parents,Relationship, Vasundhara [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-03-30 01:07:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆనందంగా పెంచేద్దాం! - EENADU
close

తాజా వార్తలు

ఆనందంగా పెంచేద్దాం!

పిల్లలు-పెంపకం

మీ పిల్లలకు ఏం ఇవ్వాలనుకుంటున్నారు?
- ఆనందం
మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు?
- సంతోషంగా
మరి పిల్లలు నిత్య సంతోషంతో ఓలలాడేలా పెంచుతున్నారా?
- ????

స్మార్ట్ కిడ్స్‌’ను తయారు చేయడంలో, ‘సక్సెస్‌ఫుల్‌ కిడ్స్‌’ను సృష్టించటంలో మునిగిపోయిన మనం నిజంగా పిల్లలు ఆనందంగా, సంతోషంగా ఉండేలా పెంచుతున్నామా? అత్యాధునిక సౌకర్యాల మాటున పిల్లలకు అన్నీ ఇచ్చేస్తున్నామన్న భావనలో మునిగిపోతున్న తరుణంలో ఇది మనమంతా వేసుకోవాల్సిన ప్రశ్న.
పిల్లలు ఆనంద అర్ణవాలు. కిలకిల నవ్వులతో, గలగల కేరింతలతో చిన్నారులు నడయాడే ఇల్లు నిజంగా సంతోష సాగరమే అవుతుంది. ఇలా నిత్య సంతోషంతో పెరిగేవారిలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహం మెండుగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. సానుకూల దృక్పథం పెంపొందుతుంది కూడా. ఇది చదువులు, ఆటల వంటి వాటిల్లో రాణించటానికి ఎంతగానో దోహదం చేస్తుంది. దీన్ని శాస్త్రీయ అధ్యయనాలూ రుజువు చేస్తున్నాయి. నిజానికి పిల్లలు ఆనందంతో పెరిగేలా చూడటం అంత తేలికైన పనేమీ కాదు. తల్లిదండ్రుల అవ్యాజమైన ప్రేమ, నమ్మకం, గౌరవం, తోడ్పాటు వంటి ఎన్నో అంశాలతో ముడిపడిన అంశం. మార్గదర్శకులుగా సరైన పద్ధతిలో నడచుకోవడం దగ్గర్నుంచి పిల్లల ఆనందాన్ని నీరు గార్చకుండా ఉండటం వరకూ అడుగడుగునా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మానసిక స్థైర్యం, ఓపిక చాలా అవసరం.
కలిసి భోజనం చేయండి
పెద్దవాళ్ల మాట చద్దన్నం మూట అంటారు. పాత చింతకాయ పచ్చడని కొందరు దీన్ని కొట్టేయొచ్చు గానీ శాస్త్రీయంగా రుజువైనప్పుడు ఔరా అనక తప్పదు. కుటుంబసభ్యులంతా కలిసి భోజనం చేయాలనే పెద్దల మాట ఇలాంటిదే. ఇది పిల్లల ఆనందానికీ దోహదం చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించటం గమనార్హం. తరచూ ఇంటిల్లిపాదితో కలిసి భోజనం చేసే పిల్లల్లో భావోద్వేగాలు నియంత్రణలో ఉంటున్నట్టు.. మద్యం, మాదక ద్రవ్యాల వంటి వ్యసనాల జోలికి వెళ్లడం తగ్గుతున్నట్టు బయటపడింది. కుంగుబాటు లక్షణాలూ తక్కువగా కనబడటం విశేషం. యుక్తవయసు ఆడపిల్లల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగానూ ఉంటోంది.
ముందు మన ఆనందమే!
చిత్రంగా అనిపించినా.. పిల్లలు ఆనందంగా ఉండాలంటే ముందు మనం ఆనందంగా ఉండటం ముఖ్యం. పిల్లలు అమాయకంగా కనిపించినా మన భావోద్వేగాలను నిశితంగా గమనిస్తుంటారు. పెద్దవాళ్లు ఏమాత్రం నిరాశా నిస్పృహల్లో ఉన్నట్టు కనిపించినా చిన్నారుల మనసూ చిన్నబోతుంది. కుంగుబాటుతో సతమతమయ్యే తల్లుల పెంపకంలో పెరిగిన పిల్లల్లో దురుసుతనం వంటి ప్రవర్తన సమస్యలు తలెత్తే అవకాశం పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి స్వార్థ చింతనతోనైనా ముందు మనం ఆనందంగా ఉండటం మంచిది. వారాంతాల్లో గానీ వీలైనప్పుడల్లా గానీ కుటుంబసభ్యులు, మిత్రులతో సినిమాలకు, షికార్లకు, యాత్రలకు వెళ్లడం వంటివి ఇందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
బంధాలు, అనుబంధాలు నేర్పించాలి
జీవితంలో బంధాలు, అనుబంధాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ మనలో ఎంతమంది వీటి గురించి పిల్లలకు వివరిస్తున్నాం? బంధాలను పెంచుకోవడమెలా అన్నది నేర్పిస్తున్నాం? ఇదేమంత కష్టమైన పని కూడా కాదు. మనసు పెట్టి ఆలోచిస్తే ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. వీలైనప్పుడు దూరపు బంధువుల ఇంటికి తీసుకెళ్లొచ్చు. చిన్నప్పుడు తామెలా కలిసి ఉన్నామో, కష్టాలు ఎదురైనప్పుడు ఎవరినెలా ఆదుకున్నామో చెప్పొచ్చు. కష్టాల్లో ఉన్నవారికి ఉడతాభక్తి సాయం చేయమని చెప్పొచ్చు. ఏదైనా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంటే వెంట తీసుకెళ్లొచ్చు. ఇలాంటివి చిన్నారుల మనసులో దయాగుణాన్ని, ఇతరులకు సాయం చేయాలనే భావననూ పెంపొందిస్తాయి. ఇది ఆనందానికీ బాటలు పరుస్తుంది. మల్టిపుల్‌ స్క్లెరోసిస్‌ బాధిత పిల్లలను అదే సమస్యతోనే బాధపడుతున్న ఇతరులతో ఫోన్‌ ద్వారా నెలకు 15 నిమిషాలు మనసు విప్పి మాట్లాడిస్తే చాలు. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తున్నట్టు, విచారం తగ్గిపోతున్నట్టు పరిశోధకులు గుర్తించటం గుర్తించారు. మనసుంటే ఇలాంటి మార్గాలెన్నో.
ఆశావహ దృక్పథం అవసరం
యుక్తవయసులో పిల్లలతో ఎదురయ్యే ఇబ్బందుల బారినపడకూడదని అనుకుంటున్నారా? అయితే చిన్నప్పట్నుంచే ఆశావహ దృక్పథంతో నడచుకునేలా అలవాటు చేయడం మంచిది. ఆశావహ దృక్పథానికి, ఆనందానికీ అవినాభావ సంబంధం ఉంది మరి. పదేళ్ల వయసు పిల్లలకు ప్రపంచాన్ని ఆశావహ దృక్పథంతో చూడటమెలా? ఆశావహ దృక్పథంతో ఆలోచించటమెలా? అన్నది నేర్పిస్తే.. యుక్తవయసులో కుంగుబాటు వంటి సమస్యల ముప్పు సగానికి పైగా తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటుండటం గమనార్హం. ఆశావహ దృక్పథం పిల్లలకు ఎంతగానో మేలు చేస్తుంది. చదువుల్లో ఆటల్లో రాణించడానికి తోడ్పడుతుంది. ఆరోగ్యంగా జీవించటానికి దోహదం చేస్తుంది. తృప్తి వంటి భావనలు మెరుగవుతాయి. ఇవన్నీ పరోక్షంగా ఆనందం, సంతోషానికి దారితీసేవే.
ఆనందం ఒక అలవాటు
ఒకరకంగా ఆలోచిస్తే ఆనందంగా, సంతోషంగా ఉండటం కూడా ఒక అలవాటులాంటిదే అని చెప్పొచ్చు. ఇది ఒకసారి అలవడితే జీవితాంతం తోడుగా నిలుస్తుంది. సహజంగానే పిల్లల మనసు కుదురుగా ఉండదు. త్వరగా ఇతరత్రా అంశాల మీదికి మళ్లుతుంటుంది. దీంతో చేయాల్సిన పనిని సకాలంలో పూర్తి చేయలేక తరువాత వాపోతుంటారు. అందువల్ల ఏదైనా పనిలో నిమగ్నమయినపుడు మనసులను దారి మళ్లించే, ఉవ్విళ్లూరించే టీవీలు, ఫోన్లు, ట్యాబ్లెట్ల వంటి వాటికి దూరంగా ఉండటం నేర్పించాలి. అలాగే ఒకేసారి అన్ని పనులను ముందేసుకోనీయకుండా ఒకటి పూర్తయ్యాక మరోటి చేసేలా అలవాటు చేయాలి. ఎప్పుడూ నీడలా వెంటాడుతూ ‘అలా చెయ్యి, ఇలా చెయ్యి’ అని ఆదేశాలు జారీ చేయకుండా పిల్లలకు ఇష్టమైన విధంగా పూర్తి చేసేలా వెసులుబాటు కల్పించాలి. ఇది తాము సొంతంగా పనులు చేయగలమన్న ధీమా కలిగిస్తుంది. ఫలితంగా ఆత్మ విశ్వాసం, ఆనందం ఇనుమడిస్తాయి.

స్వీయ క్రమ శిక్షణ కీలకం
జీవితంలో విజయం సాధించాలంటే తెలివి తేటల కన్నా స్వీయ క్రమశిక్షణే ముఖ్యం. ఇలాంటి క్రమశిక్షణ గల పిల్లలు పెద్దయ్యాక మరింత బాగా, ఆనందంగా జీవిస్తున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇంకా బడికి వెళ్లని వయసు పిల్లలపై నిర్వహించిన చాక్లెట్‌ పరీక్షలో ఈ విషయం స్పష్టంగా రుజువైంది. రెండో చాక్లెట్‌ కోసం నిగ్రహం కనబరచిన పిల్లలు యుక్తవయసులో చదువుల్లో రాణించటం, సామాజిక సంబంధాల్లో ముందుండటం గమనార్హం. స్వీయ క్రమశిక్షణతో ఒత్తిడి, చిరాకు వంటి వాటిని తేలికగా అధిగమించే సామర్థ్యం అబ్బుతుంది. సామాజిక సంబంధాల మూలంగా స్నేహితులు, చుట్టుపక్కల వారితో సాన్నిహిత్యమూ పెరుగుతుంది. ఇవి వ్యక్తిగత జీవితంలో రాణించడానికి, ఆనంద జీవనానికి బాటలు పరుస్తాయి.

-పి.భాగ్యలక్ష్మి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.