close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/04/2019 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కలగలిపి వాడేస్తే... కళగా కనిపిస్తారు!

కాస్త రంగు తక్కువగా ఉండేవారు అలంకరణ చేసుకునే విషయంలో సందేహిస్తారు.  మేకప్‌ వేసుకుంటే అతిగా కనిపిస్తామేమో అని భయపడతారు. అలాంటివారికే ఈ సూచనలు.

మనం ఏ రంగులో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత అందంగా కనిపిస్తాం. అప్పుడే అలంకరణ కూడా అదనపు అందాన్ని తెచ్చిపెడుతుంది.
* మేకప్‌ వేసుకోవడానికి ముందు ఏ శరీర ఛాయవారైనా ముందు చర్మంపై పేరుకొన్న మృతకణాలను తొలగించేందుకు క్లెన్సింగ్‌ చేయాలి. ఆ తరువాత మాయిశ్చరైజర్‌ రాస్తే చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపిస్తుంది.
* ఏ రంగు ఫౌండేషన్‌ వాడుతున్నాం అనేది రంగు తక్కువగా ఉన్నవారు గమనించుకోవాలి. ఛాయ తక్కువ కాబట్టి ఏ రకమైనా వేసుకోవచ్చు అని అనుకోకండి. అలా చేస్తే మేకప్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మీ చర్మ రంగుకి దగ్గరగా ఉండే ఫౌండేషన్‌ని మాత్రమే ఎంచుకోవాలి. అలాంటిది దొరక్కపోతే రెండు ఫౌండేషన్‌ ఛాయల్ని కలిపి చూడండి.
* జిడ్డు చర్మతత్వం అయితే నీటి ఆధారిత ఫౌండేషన్‌, పొడిచర్మతత్వం ఉన్నవారైతే క్రీం ఆధారిత ఫౌండేషన్‌ని వేసుకోవచ్చు. నచ్చిన రంగు దొరికన తరువాత నుదురు, చెంప, మణికట్టుమీద రాసి చూసుకోవాలి.
* నలుపు, చామనఛాయ, రంగులో ఉండేవారికి కళ్లే అసలైన అందం. ముఖ అలంకరణలో ఇదే కీలకం కూడా. అందుకే ద్రవ రూపంలో ఉండే ఐలైనర్ల కన్నా, క్రీంఆధారిత రకాలు వీరికి సరైన ఎంపిక. మస్కారా కూడా కంటికి పెట్టుకుంటే కళ్లు విశాలంగా కనిపిస్తాయి.
* కాస్త ఛాయ తక్కువగా ఉన్నప్పుడు గులాబీ రంగు ఐషాడో ఎంచుకోకపోవడమే మంచిది. దానికి బదులు రాగి, ముదురు గోధుమ వర్ణాలను ప్రయత్నించండి. అవి మీ చర్మ ఛాయకి సరైన ఎంపిక.  మస్కారా వేస్తే కంటి అందం రెట్టింపవుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.