Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 84251
            [news_title_telugu_html] => 

చలువకు మెంతి పూత

[news_title_telugu] => చలువకు మెంతి పూత [news_title_english] => [news_short_description] => వేడి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ప్రభావంతో చర్మం, జుట్టు పాడవుతాయి. అలాకాకుండా ఉండాలన్నా, దాన్నుంచి ఉపశమనం పొందాలన్నా వంటింట్లో దొరికే మెంతులతోనే చిన్న చిన్న చిట్కాలు పాటించొచ్చు. అదెలా అంటే.. [news_tags_keywords] => Fenugreek , face pack , hair pack, Vasundhara [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-16 00:54:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చలువకు మెంతి పూత - EENADU
close

తాజా వార్తలు

చలువకు మెంతి పూత

వేడి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ప్రభావంతో చర్మం, జుట్టు పాడవుతాయి. అలాకాకుండా ఉండాలన్నా, దాన్నుంచి ఉపశమనం పొందాలన్నా వంటింట్లో దొరికే మెంతులతోనే చిన్న చిన్న చిట్కాలు పాటించొచ్చు. అదెలా అంటే...!

* ఎండలో తిరిగి చర్మం నల్లగా మారితే....కొద్దిగా పాలల్లో అరచెంచా మెంతిపిండిని కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఆరాక చల్లటి నీళ్లతో కడిగేస్తే మునుపటి ఛాయ వస్తుంది.
* మెంతులు దుమ్మూ, ధూళి, మృతకణాలని తొలగించి చర్మరంధ్రాలని తెరుచుకునేట్టు చేస్తాయి. ఇందుకోసం చెంచా మెంతిపిండిని పుల్లని పెరుగులో కలిపి దాన్ని ముఖానికి రాసి.. అరనిమిషం ముని  వేళ్లతో గుండ్రంగా తిప్పుతూ మర్దన చేయాలి. ఆపై నీళ్లతో కడిగేసుకుంటే మృదువుగా మారుతుంది.
* ఈ కాలంలో చర్మంపై జిడ్డు పేరుకుని మొటిమలు ఇబ్బందిపెడతాయి. ఇలాంటప్పుడు పావుచెంచా మెంతుల్ని ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. చల్లారిన తర్వాత గింజలని తీసి ఆ నీటితో  సమస్య ఉన్నచోట తుడవాలి. ఇలా తరచూ చేస్తుంటే మెంతిలోని యాంటీసెప్టిక్‌ గుణాలు సమస్యను తగ్గిస్తాయి.
* గుప్పెడు మెంతులని రాత్రంతా నానబెట్టి దానికి పుల్లటి పెరుగు, చెంచా నిమ్మరసం, కొద్దిగా ఆలివ్‌నూనె కలిపి పేస్ట్‌లా చేయాలి. దాన్ని తలకు రాసుకుని షవర్‌క్యాప్‌ పెట్టుకోవాలి. ఇలా చేస్తే మాడుకి చల్లదనం అందుతుంది. నిర్జీవంగా మారిన జుట్టు నిగారింపుతో కనిపిస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.