close

తాజా వార్తలు

చెక్స్‌తో చెక్‌ పెట్టేద్దాం!

కాలంతో పాటు ఫ్యాషన్‌లోనూ ఎన్నో మార్పులు కనిపిస్తాయి. కొన్నిసార్లు పాత డిజైన్‌లే సరికొత్తగా ఆకట్టుకుంటాయి. క్లాసీలుక్‌తో ఆకట్టుకోవాలన్నా, క్యాజువల్‌గా కూల్‌గా కనిపించాలన్నా చెక్స్‌ని మించిన డిజైన్‌ లేదు. ఇక, ఈ వేసవిలో అందరినీ ఆకట్టుకుంటోన్న ట్రెండ్‌ ఇది. దాన్నెలా ఎంచుకోవాలో చూద్దామా!

టార్టాన్‌ చెక్స్‌, ప్లెయిడ్‌చెక్స్‌, మైక్రో-మాక్రో చెక్స్‌ ఇలా పేరేదైనా...గళ్లు అటు సంప్రదాయ వస్త్రశ్రేణిపైనా, ఇటు ఆధునిక దుస్తులమీద కూడా అందంగా అమరిపోతాయి. పొడవు, పొట్టి, నలుపు, తెలుపు అనే రంగుల తేడా లేకుండా ఎవరినైనా చెక్స్‌ అందంగా కనిపించేలా చేస్తాయి. ఎవరికైనా ఇట్టే నప్పేస్తాయి. వాటిల్లో...
* కంచి పట్టు చీరలపై జరీలతో నేసిన గళ్లు, మద్రాస్‌ చెక్స్‌ మైమరిపిస్తే, మల్టీకలర్‌ చెక్స్‌తో ఫ్యాన్సీ చీరలు చూపుతిప్పుకోనివ్వవు. అదే కాదు లేత రంగుల్లో లినెన్‌ చీరపై గళ్లబ్లవుజుని మ్యాచింగ్‌ చేసుకుంటే ఆ లుక్కే వేరు.
* గులాబీరంగు ప్లెయిడ్‌ చెక్స్‌ షర్ట్‌ తెలుపు రంగు ప్యాంట్‌మీదకు బాగుంటుంది. అదే గళ్ల బ్లేజర్‌ని వేసుకోవాలనుకుంటే గ్రాఫిటీ టీషర్ట్‌, వింటేజ్‌ జీన్స్‌ని మ్యాచింగ్‌గా వేసుకుంటే వారెవ్వా అనిపించడం ఖాయం.

* ఇక టీనేజీ అమ్మాయిలకు స్కర్ట్‌లు భలే అందాన్ని తెచ్చిపెడతాయి. లేత రంగులో ప్లెయిడ్‌ చెక్స్‌ షర్ట్‌కి జతగా ముదురువర్ణంలో నీలెంగ్త్‌ స్కర్ట్‌ నప్పుతుంది.


* టాప్‌లే కాదు ప్యాంట్లలోనూ ఈ గళ్లను ఎంచుకోవచ్చు. నలుపు, బూడిద రంగు, తెలుపు వంటి సాదా రంగుల టీషర్ట్‌లకు చెక్స్‌ ప్యాంట్స్‌ చక్కని ఎంపిక.

* గళ్లు సిల్క్‌, క్రేప్‌, జార్జెట్‌ వంటివాటికంటే హ్యాండ్‌లూమ్‌లో బాగుంటాయి. వీటిల్లో మిడ్‌లైన్‌ డ్రెస్‌లు, టాప్‌లు, ఇండో వెస్ట్రన్‌ కుర్తీలు, పలాజోలు...ఇలా వేటిని కుట్టించుకున్నా ట్రెండే.

* చెక్స్‌లో ఏ రకాన్ని ఎంచుకున్నా  కూడా పెద్దగా యాక్సెసరీల అవసరం ఉండదు. చెవులకు చిన్న స్టడ్స్‌, చేతికి ఓ వాచ్‌ చాలు. స్లింగ్‌ బ్యాగ్‌, కాళ్లకు స్నీకర్స్‌ మిమ్మల్ని ఫ్యాషన్‌కి ఐకాన్‌లా కనిపించేలా చేస్తాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.