Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 96616
            [news_title_telugu_html] => 

వ్యాధికి సాధనం...వైద్యం సులభం

[news_title_telugu] => వ్యాధికి సాధనం...వైద్యం సులభం [news_title_english] => [news_short_description] => వీరిద్దరూ ఇంజినీరింగ్‌లో రాటుదేలిన విద్యార్థులు... మెల్లిగా మెడిసిన్‌లో మెలకువలు నేర్చుకున్నారు... రోగులకు మేటిగా సేవలందించేలా పనిచేస్తున్నారు... ఒకరు పసిపిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించే పరికరం తయారు చేస్తే... మరొకరు ఫిజియోథెరపి సులువుగా జరిగే సాధనం కనుగొన్నారు... [news_tags_keywords] => Nemocare organisation, App, Inspiring story, Mahila jayaho, Vasundhara specail page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-11 00:58:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వ్యాధికి సాధనం...వైద్యం సులభం - EENADU
close

తాజా వార్తలు

వ్యాధికి సాధనం...వైద్యం సులభం

వీరిద్దరూ ఇంజినీరింగ్‌లో రాటుదేలిన విద్యార్థులు... మెల్లిగా మెడిసిన్‌లో మెలకువలు నేర్చుకున్నారు... రోగులకు మేటిగా సేవలందించేలా పనిచేస్తున్నారు... ఒకరు పసిపిల్లల ఆరోగ్యాన్ని పరీక్షించే పరికరం తయారు చేస్తే... మరొకరు ఫిజియోథెరపి సులువుగా జరిగే సాధనం కనుగొన్నారు... వారే హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష, మైత్రేయి కొండపి. ఆ విశేషాలేంటంటే...

పిల్లలకోసం పనిచేశా...
నవజాత శిశు మరణాలు ప్రత్యూష పారెడ్డిని ఆలోచించేలా చేశాయి. ప్రారంభ దశలోనే వాళ్లకు ఎదురయ్యే అనారోగ్యాలు కనిపెడితే... వాళ్లను కాపాడొచ్చని భావించింది. ఆ ఆలోచనల ఫలితమే నిమోకేర్‌ సంస్థ.
వైద్యరంగంతో నాకు చిన్నప్పటి నుంచీ అనుబంధం ఉంది. అమ్మానాన్న, మా వారూ డాక్టర్లే. నేను మాత్రం వైద్యం చదవాలనుకోలేదు. హైదరాబాద్‌లోని వాసవీ కాలేజీలో ఇంజినీరింగ్‌ అయ్యాక ఐటీ ఉద్యోగం చేశా. కానీ డిజైనింగ్‌పై ఉన్న ఇష్టం, వైద్యరంగంతో బంధం... నన్ను ఇటువైపు లాక్కొచ్చాయి. గంటల తరబడి కదలకుండా కూర్చుని చేసే ఐటీ ఉద్యోగం నాకు నచ్చలేదు. దాంతో  వదిలేశా. ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు చిత్రలేఖనంపై నాకున్న ఆసక్తి గుర్తొచ్చింది. కాలేజీలో ఎప్పుడూ ఏదో ఒక బొమ్మ గీసే నన్ను గమనించిన ఓ ప్రొఫెసర్‌ ఎన్‌ఐడీలో చేరమని సలహా ఇచ్చారు.  అది గుర్తొచ్చి... డిజైనింగ్‌ వైపు వెళ్లడానికి సిద్ధమయ్యా. ఇది తెలిసి అమ్మానాన్నతో సహా అంతా ‘ఇంజినీరింగ్‌ చదివి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేస్తావా’ అని అన్నారు. వాళ్లను ఒప్పించి ఎన్‌ఐడీలో చేరా. అక్కడ ఇండస్ట్రియల్‌ డిజైనింగ్‌ నేర్చుకున్నా. నేను నేర్చుకున్న విద్య అందానికో, అలంకరణకో కాకుండా సమాజానికి ఉపయోగపడాలనుకున్నా.

గుజరాత్‌ ప్రభుత్వంతో కలిసి... శిక్షణ తీసుకుంటున్నప్పుడు  కొన్నాళ్లు మాతాశిశు సంరక్షణలో భాగంగా గుజరాత్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అక్కడ మారుమూల పల్లెల్లో తిరిగేదాన్ని. పసిపిల్లలకు వచ్చే సమస్యలు, గర్భిణులు పడే బాధలను తెలుసుకున్నా. ఆ తరువాత కొన్నాళ్లకు హెల్త్‌కేర్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోర్సు చేయాలనుకున్నా. కానీ అది స్టాన్‌ఫోర్డ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆ ప్రయత్నాల్లో ఉండగానే పెళ్లయ్యింది. మా వారి ద్వారా ఆ సంస్థ ఐఐటీ -హైదరాబాద్‌తో కలిసి పనిచేస్తుందని, దానికి సంబంధించిన సదస్సు ఇక్కడే జరగబోతోందని తెలుసుకున్నా. అలా సెంటర్‌ఫర్‌ హెల్త్‌కేర్‌ ఫెలోషిప్‌కి దరఖాస్తు చేసుకున్నా. అక్కడే నాలాంటి ఆలోచనలతో ఉన్న మనోజ్‌ పరిచయం అయ్యాడు. చివరకు ఇద్దరం కలిసి నవజాత శిశువు సంరక్షణ విభాగంలో పనిచేయడానికి సిద్ధమయ్యాం. ఎందుకంటే... మనదేశంలో ప్రతి వెయ్యిమంది పిల్లల్లో సగటున ముప్ఫై మంది పిల్లలు చనిపోతున్నారు. కారణాలు తెలుసుకునేందుకు రోజుల తరబడి వైద్యులతో కలిసి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూ, ఎస్‌ఐసీయూల్లో పనిచేశాం. చాలా విషయాలు తెలుసుకున్నాం.

పరికరం కనిపెట్టాలని... చాలా ఆసుపత్రుల్లో అప్పుడే పుట్టిన పిల్లలకు అత్యవసర వైద్యం అందించడం మినహా తగినంత పర్యవేక్షణ ఉండదు. వార్మర్‌లూ తక్కువే. వీటివల్ల పిల్లలకు భవిష్యత్తులో ఎదురయ్యే ఎదుగుదల లోపాలు మొదలు, డౌన్స్‌ సిండ్రోమ్‌ వంటివి గుర్తించడం కష్టం అవుతుంది. ఇలాంటివన్నీ చూశాకే ఓ పరికరాన్ని కనిపెట్టాలనుకున్నాం. ప్రాజెక్ట్‌ సిద్ధం చేసుకుని మిలిందాగేట్స్‌ ఫౌండేషన్‌తో మా ఆలోచన పంచుకున్నాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. దాంతో నిమో పేరుతో రిజిస్టర్‌ చేయించాం. ప్రోటోటైప్‌లో పరికరాన్ని రూపొందించి... మరిన్ని మార్పులతో తుదిరూపు తీసుకోవడానికి సుమారు ఏడాదిన్నర కాలం పట్టింది. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద ఐదు ఆసుపత్రుల్లో మా పరికరం క్లినికల్‌ ట్రయిల్‌ పూర్తి చేసుకుంటోంది. అది పూర్తయ్యాక పెద్ద ఎత్తున్న దీన్ని తయారు చేయబోతున్నాం. ఇందుకు ఇప్పటివరకూ సుమారు మూడుకోట్ల రూపాయలు ఖర్చుపెట్టాం.

ఇదెలా పనిచేస్తుందంటే... మా పరికరం పేరు నిమోకేర్‌ రక్ష. ఇది చిన్న బ్యాండ్‌. దీన్ని శిశువు కాలికి తగిలిస్తే చాలు... ఇందులో అమర్చిన సెన్సార్ల ద్వారా గుండె, ఊపిరితిత్తులు వంటివాటి పనితీరుని తెలుసుకోవచ్చు. పాపాయి శరీర ఉష్ణోగ్రతల్ని అంచనా వేసి మానిటర్‌కి చేరవేస్తుంది. ఏదయినా సమస్య ఉన్నా తెలియజేసి వైద్యుల్ని హెచ్చరిస్తుంది. ఈ పరికరానికి ఎటువంటి వైర్లు ఉండవు కాబట్టి సులువుగానే ఉపయోగించొచ్చు. ఆ అప్‌డేట్‌లను తెలుసుకోవడానికి ఒక్క స్క్రీన్‌ పెట్టుకుంటే చాలు చిన్నారుల ఆరోగ్యాన్ని గమనించుకోవచ్చు. దీన్ని డాక్టర్‌లు తమ ఫోన్‌కి లింక్‌ చేసుకుంటే ఎక్కడున్నా వారి ఆరోగ్యాన్ని సమీక్షించొచ్చు. ముందుగానే పిల్లలకు వచ్చే సమస్యల్ని అంచనా వేసి, నివారించొచ్చు. దీనివల్ల పిల్లల వైద్యఖర్చు కూడా తగ్గుతుంది.

ఇబ్బందులు ఉన్నా... దీన్ని అందుబాటులోకి తెచ్చే క్రమంలో కొన్ని సమస్యలు తప్పలేదు. వివిధ దశల్లో ఆయా ఆసుపత్రులు, ప్రభుత్వ అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూశాం. ఒకసారైతే అనుమతి రావడానికి సుమారు తొమ్మిది నెలలు పట్టింది. ఇక ఫండింగ్‌ మరో సమస్య. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ముందడుగు వేయాలి. ప్రతిదశలోనూ డబ్బుల అవసరం ఉంటుంది. పదిమందికి మా ఆలోచన చెబితే...ఒకరు కొంత సాయం చేయగలుగుతారు. ఈ క్రమంలో మాకు బిల్‌గేట్స్‌ మిలిందా ఫౌండేషన్‌, బైరాక్‌ బయోటెక్నాలజీ రీసెర్స్‌ కౌన్సెల్‌, ఐఐటీ హైదరాబాద్‌ ఎంతో సాయం చేశాయి. ఇన్ని సమస్యలు ఎదురైనా ఆ పరికరం వందశాతం విజయవంతం అయినప్పుడు అన్నింటినీ మర్చిపోయాం.

అధ్యయనం చేసి...

రెండేళ్లక్రితం... నేను, మా వారు సురేష్‌ కలిసి స్టార్టూన్‌ల్యాబ్స్‌ని ప్రారంభించాం. ఇది ఓ హార్డ్‌వేర్‌ స్టార్టప్‌. వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా బయోమెడికల్‌ పరికరాల తయారీకి ఉపయోగపడే డిజైనింగ్‌, కోడింగ్‌, మాన్యుఫాక్చరింగ్‌ సేవలు అందిస్తాం. ఇలా దేశవిదేశాల్లోని పలు సంస్థలు మా ఖాతాదారులుగా ఉన్నాయి. సామాజిక ప్రయోజనం ఇమిడి ఉండేలా మేమే సొంతంగా ఓ బయో మెడికల్‌ పరికరాన్ని తయారు చేయాలనుకున్నాం. అదే ఫిజీ. ఇది ఆర్థోపెడిక్‌ రోగులు చేయించుకునే ఫిజియో థెరపీ పురోగతిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. నిజానికి మన దేశంలో హార్డ్‌వేర్‌ స్టార్టప్‌లు చాలా తక్కువ. నేను, మావారు ఐఐటీ మద్రాస్‌ నుంచి ఎలక్ట్రానిక్స్‌ డిజైనింగ్‌లో ఎంఎస్‌ పూర్తిచేశాం. ఆ తరువాత మా వారు ఐఐఎమ్‌ కోల్‌కతా నుంచి ఈపీబీఎం, నేను అహ్మదాబాద్‌ ఐఐఎమ్‌ నుంచి ఈపీఏబీఏ పూర్తి చేశాం. ఇద్దరికీ బయోమెడికల్‌, ఆటోమోటివ్‌ రంగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. దాంతో బయో మెడికల్‌ రంగంలో స్మార్ట్‌సిస్టమ్స్‌ డెవలప్‌మెంట్‌పై దృష్టిపెట్టాం. దానిలో భాగంగా సుమారు ఏడాదిన్నర పాటు దేశమంతా తిరిగి అధ్యయనం చేశాం. చాలావరకూ గుండె, క్యాన్సర్‌, గర్భిణులకు ఉపయోగపడే అడ్వాన్స్డ్‌సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది కానీ ఫిజియోథెరపీకి లేదని అప్పుడే తెలుసుకున్నాం.
ఆ నిధులతోనే: సాధారణంగా మోకాలు, ఎముకలు, కీళ్లు వంటివాటికి శస్త్ర  చికిత్సలు జరిగినప్పుడు, బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చినప్పుడు ఫిజియో థెరపీ అవసరం అవుతుంది. అయితే ఎంతవరకూ మెరుగుపడ్డారనేది ప్రత్యేకించి గుర్తించే పరికరాలు అందుబాటులో లేవు. వాళ్ల శరీర కదలికల్ని బట్టి మాత్రమే అంచనా వేస్తారు. అందుకే ఆ రికవరీని కచ్చితంగా గుర్తించగలిగేలా ఫిజీని అందుబాటులోకి తెచ్చాం. ఇది ఫోనుకు అనుసంధానమై ఉంటుంది. ఆల్గారిథమ్‌తో రూపొందించిన ఈ పరికరం రోగి అవసరాలకు అనుగుణంగా కస్టమైజేషన్‌  చేసి ఉంటుంది. ఇక, పేటెంట్‌, అనుమతులు, తయారీ, ఇతర అవసరాల కోసం స్టార్టూన్‌ ల్యాబ్స్‌ సేవల ద్వారా అందుకుంటోన్న ఆదాయాన్ని దీనికి ఖర్చుపెట్టాం. పరికరం ఓ స్థాయికి వచ్చాక నిధుల సేకరణ చేపట్టాం. కేంద్రప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ సంస్థ(బైరాక్‌) బయోమెడికల్‌ పరికరాల అభివృద్దికి ఇచ్చే గ్రాంటు యాభైలక్షల రూపాయలు అందుకున్నాం.

విదేశాల నుంచి...

ఈ పరికరం ప్రస్తుతం వైద్యులు, ఫిజియోథెరపిస్టులు పరీక్షించే దశలో ఉంది. ఇందుకోసం కొన్ని ప్రముఖ ఆసుపత్రులతో అనుసంధామై చేస్తున్నాం. మరికొన్ని రోజుల్లో దీన్ని మార్కెట్‌లోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాం.  నిజానికి ఇతర స్టార్టప్‌లతో పోల్చి చూసినప్పుడు హార్డ్‌వేర్‌ స్టార్టప్‌ల నిర్వహణ కష్టం. అందులోనూ బయోమెడికల్‌ డివైస్‌ తయారీకి మరింత ఎక్కువ సమయం పడుతుంది. వీటికి కావలసిన కాంపొనెంట్స్‌ అన్నీ విదేశాల నుంచి తెప్పించుకోవాలి. వీటన్నింటినీ దాటుకుని ముందడుగు వేస్తున్నాం.

సులువుగా ఫిజియోథెరపీ...

* ఆ యాప్‌ పేరు ఫిజీ. నరాలు, కీళ్ల సంబంధ రోగులు చేయించుకునే ఫిజియోథెరపీ అవసరాన్ని తెలియజేస్తుంది. దీన్ని అందుబాటులోకి తెచ్చింది మైత్రేయి కొండపి.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.