
తాజా వార్తలు
ఏడేళ్ల నిరీక్షణ..!
వైజాగ్‌లో ఇంటర్ చదువుతుండగా పవన్‌కుమార్ పరిచయమయ్యాడు. మాది ఝార్ఖండ్ అయినా నాన్న ఉద్యోగరీత్యా వైజాగ్ వచ్చాం. పవన్ వాళ్ల నాన్నగారు నౌకాదళ ఉద్యోగి కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చదవడం వల్ల తనకూ హిందీ వచ్చు. భాషతో ఇబ్బంది లేకపోవడంతో మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. తర్వాత ఇద్దరం ఒకే ఇంజినీరింగ్ కాలేజీలో చేరడంతో మా స్నేహబంధం బలపడింది. ఇంజినీరింగ్‌లో పవన్ మెరిట్ స్టూడెంట్‌గా మంచిపేరు సంపాదించుకున్నాడు. నాకేమైనా సందేహాలుంటే పవన్‌ని అడిగి తెలుసుకునేదాన్ని. మా పరిచయమైన నాలుగేళ్లకు నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పాడు పవన్. నా అంగీకారాన్నీ తెలియజేశాను. ప్రేమంటే సినిమాలు, షికార్లంటూ సమయాన్ని వృథా చేయడం కాదని, బాగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎవరి పరిమితుల్లో వాళ్లు ఉండాలని హద్దులు గీసుకున్నాం. మేం ప్రేమించుకుంటున్న సంగతి స్నేహితులకు తెలిసినా.. కలిసి తిరగకపోవడం, ఫోన్లో మాట్లాడుకోకపోవడంతో మా ప్రేమ బెడిసికొట్టిందని అనుమానించారు.
పవన్‌కు ఎంటెక్ చేయాలనే ఆసక్తి ఉండటంతో ప్రోత్సహించాను. చండీగఢ్‌లో సీటు రావడంలో అక్కడికి వెళ్లిపోయాడు. ఈలోగా నాన్నకు బదిలీకావడంతో మేం కటక్ వెళ్లిపోయాం. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లం. తను చండీగఢ్ వెళ్లిన రెండేళ్లలో రెండే రెండుసార్లు రైల్వేస్టేషన్లో కలిసి కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నాం. నాకు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వెళ్లిపోయాను. ఎంటెక్ పూర్తయిన తర్వాత కొన్ని అనుబంధ కోర్సులు చేయడానికి పవన్ హైదరాబాద్ రావడంతో అప్పుడప్పుడూ కలుసుకునేవాళ్లం. నాకు ఉద్యోగం వచ్చినా పవన్‌కు రాకపోవడంతో తనకు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కిందటి ఏడాది తనకూ ఉద్యోగం రావడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. మా రాష్ట్రాలు, భాషలు, సంస్కృతీ సంప్రదాయాలు, సామాజిక నేపథ్యం వేరు కావడంతో మా పెళ్లికి నాన్న అంగీకరించలేదు. కాలేజీ రోజుల నుంచీ ఒకర్నొకరు ఇష్టపడ్డా జీవితంలో స్థిరపడేంత వరకూ ఎదురుచూశామని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు. ఆయన్ను ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పవన్ నాన్నగారు మాత్రం మా పెళ్లికి వెంటనే అంగీకరించారు. పెళ్లంటూ చేసుకుంటే పవన్నే చేసుకుంటానని, లేకపోతే పెళ్లే చేసుకోనని పట్టుపట్టాను. తర్వాత మా నాన్న పెళ్లికి అంగీకరించడంతో మా కథ సుఖాంతమైంది.
కాలేజీ రోజుల నుంచీ ప్రేమించుకుంటున్నా.. మేం నిర్ణయించుకున్న హద్దులను ఏనాడూ అతిక్రమించలేదు. తలిదండ్రులు కోరుకున్నట్లు మా ప్రాధాన్యం చదువుకే ఇచ్చాం. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. ఆర్థికంగా స్థిరపడ్డా నాన్న మాటకు విలువనిచ్చాం. అందరూ మాలాగే ఉండాలని చెప్పడం లేదు. కానీ సమయాన్ని వృథా చేయకుండా, హద్దులు దాటకుండా, పెద్దల మాటను గౌరవించీ ప్రేమను గెలిపించుకోవచ్చని చెబుతున్నాం.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- స్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
- ఈ ఒక్క రోజు..
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
