Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 101299
            [news_title_telugu_html] => 

హోప్‌.. చాలా ఉంది

[news_title_telugu] => హోప్‌.. చాలా ఉంది [news_title_english] => Shy hoop Talent in ipl [news_short_description] => వెస్టిండీస్‌ అనగానే ఏ గేలో, ఏ రసెలో గుర్తొస్తారు. కానీ ఇటీవల కాలంలో ఓ ఆటగాడు ఎంతో ఎదిగిపోయాడు. చక్కని ప్రదర్శనతో జట్టులో ముఖ్య ఆటగాడిగా... [news_tags_keywords] => Shy hoop,ipl,sports [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-21 09:25:05 [news_isactive] => 1 [news_status] => 2 ) )
హోప్‌.. చాలా ఉంది - Shy hoop Talent in ipl - EENADU
close

తాజా వార్తలు

హోప్‌.. చాలా ఉంది

ఓ కన్నేయండి

వెస్టిండీస్‌ అనగానే ఏ గేలో, ఏ రసెలో గుర్తొస్తారు. కానీ ఇటీవల కాలంలో ఓ ఆటగాడు ఎంతో ఎదిగిపోయాడు. చక్కని ప్రదర్శనతో జట్టులో ముఖ్య ఆటగాడిగా మారిపోయాడు. అతడే షై హోప్‌. పరిమిత ఓవర్ల క్రికెట్లో వికెట్‌కీపింగ్‌ కూడా చేసే హోప్‌.. జట్టులో అంతర్భాగమయ్యాడు. ఆ జట్టులో 50కిపైగా వన్డే సగటు ఉన్న ఏకైక బ్యాట్స్‌మన్‌ హోప్‌. తానాడిన చివరి ఐదు వన్డేల్లో 470 పరుగులు చేసిన అతడు సూపర్‌ ఫామ్‌తో ప్రపంచకప్‌కు సిద్ధమయ్యాడు. మంచి టెక్నిక్‌ ఉన్న ఆటగాడని అతడికి పేరు. 25 ఏళ్ల హోప్‌ అలవోకగా ఆడే కట్స్‌, పుల్స్‌.. మంత్రముగ్దుల్ని చేసే ఆఫ్‌ డ్రైవ్స్‌ చూసి తీరాల్సిందే. ఐతే అతడి నుంచి వెస్టిండీస్‌ నిలకడను కోరుకుంటోంది. స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపించే అతడు.. అంతలోనే వికెట్‌ సమర్పించుకుంటాడు. అయినా.. ప్రపంచకప్‌లో కూడా వెస్టిండీస్‌ అవకాశాలకు హోప్‌ ఎంతో కీలకం. కాస్త జాగ్రత్త వహిస్తే.. మెగా టోర్నీలో అతడు గొప్ప ప్రదర్శన చేయగలడని విండీస్‌ నమ్ముతోంది. ఈ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ ఇప్పటివరకు 54 వన్డేల్లో 51.06 సగటుతో 2247 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 10 అర్ధశతకాలు ఉన్నాయి. ప్రపంచకప్‌లో అతడు చూడదగ్గ ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.