close

తాజా వార్తలు

ఆ విషయాలు ఏ వయసులో చెప్పొచ్చు?

మా పాపకు పన్నెండేళ్లు. ఇప్పుడిప్పుడే తన శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయి. దాంతో వాటి గురించి రకరకాల ప్రశ్నలు వేస్తోంది. వాటికి ఏం సమాధానాలు చెప్పాలో? ఎలా వివరించాలో అర్థం కావడం లేదు. అసలు ఏ వయసు నుంచి వారికి శారీరక మార్పులు, లైంగిక విజ్ఞానం గురించి చెప్పొచ్చు?

- ఓ సోదరి

 

పిల్లలు ఈ వయసులో తమ శరీరాన్నే కాదు, స్నేహితుల్లో కనిపించే మార్పులను కూడా గమనిస్తారు. ఇప్పుడు వారికి వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అబ్బాయిలు అమ్మాయిల గురించి... అమ్మాయిలు అబ్బాయిల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఇది పదేళ్ల నుంచే మొదలవుతుంది. ఈ వయసులో అమ్మాయిల వ్యక్తిగత రహస్య భాగాల్లో కొద్దిగా రోమాలు కనిపించడం, ఛాతీభాగంలో మార్పులు రావడం సర్వసాధారణం. అలాగే అబ్బాయిల్లో నూనూగు మీసాలు, గొంతు మారడం, ఎత్తు పెరగడం వంటివి కనిపిస్తాయి. ఆ వయసు పిల్లలందరిలోనూ ఇవే మార్పులు ఉంటాయి. వాటిని గమనించినప్పుడు వీరికి తెలియకుండానే ఆ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఒక ఈడువారంతా బృందంగా మారి తమలో జరుగుతోన్న మార్పుల గురించి చర్చించుకుంటారు. దీన్నే సెక్సువాలిటీ అంటారు.

ఏం చేయాలంటే...
పిల్లలు ఇలాంటి సందేహాలను మీ ముందు ఉంచినప్పుడు ‘నీకెందుకు ఇవన్నీ’ అంటూ కోప్పడకండి. మీ పాప ఏదైనా ప్రశ్న వేసినప్పుడు దాన్ని దాటేయకండి. విననట్లు ఉండకండి. మీకు తెలిసిందే చెప్పండి. అయితే శాస్త్రీయంగా, అర్థమయ్యేలా చెప్పాలి. ఉదాహరణకు దోమ లార్వా నుంచి ప్యూపా దశకు ఎలా మారుతుందో తెలుసుకునేలా చేయాలి. అదే పరిణామక్రమం మనుషులకూ ఉంటుందని, వయసు ఎదుగుతోన్న కొద్దీ శరీర భాగాలు కూడా పెరుగుతాయని వారికి అవగాహన కల్పించాలి. పదేళ్లు దాటిన తరువాత శారీరక దృఢత్వంతోపాటు ఆడ, మగలో కొన్ని శారీరక, వ్యక్తిత్వ మార్పులు కూడా వస్తాయని, వాటికి కారణం హార్మోన్లేనని తెలియజెప్పి వాటి ప్రాముఖ్యాన్ని వివరించాలి. అలానే నెలసరి గురించి చెప్పాలి కానీ భయపెట్టకూడదు. అది ఎలా మొదలవుతుందో ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓపికగా వివరించాలి. శుభ్రత పాటించకపోతే వచ్చే అనారోగ్యాల గురించి తెలియజేయాలి. అలాగే బ్యాడ్‌ టచ్‌... గుడ్‌ టచ్‌ వంటి వాటిపై అవగాహన కల్పించాలి. అనవసరంగా ఎవరైనా శరీరాన్ని తాకితే ప్రతిఘటించడం నేర్పించాలి అయితే అన్నింటినీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా చెప్పడం మంచిది.

- మీ సందేహాలను vasukid@eenadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.