Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 109896
            [news_title_telugu_html] => 

వ్యాపారం+సేవ= శ్రావ్య

[news_title_telugu] => వ్యాపారం+సేవ= శ్రావ్య [news_title_english] => [news_short_description] => ఆమె చదివింది ·కెమికల్‌ ఇంజినీరింగ్‌ అయినా... మోడలింగ్‌లో సత్తా చాటింది. లిప్‌స్టిక్‌లు తయారుచేసి అమ్ముతూ... తద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సేవకు కేటాయిస్తోంది.  ఆమే కెనడాలో స్థిరపడ్డ తెలుగమ్మాయి శ్రావ్య కల్యాణపు. రెండేళ్లక్రితం... శ్రావ్య ప్రజల ఓటింగ్‌ ద్వారా మిస్‌ వరల్డ్‌ కెనడా టైటిల్‌ని సొంతం చేసుకుంది. అనుకోకుండా పోటీల్లో పాల్గొన్నా అక్కడితో ఆగిపోలేదామె. చదువు, వ్యాపారం, సేవ అన్నింటినీ సమన్వయం చేసుకుంటోంది. [news_tags_keywords] => Sravya  kalyanapu, Mahila jayaho, Business, Service, Vasundhara special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-10 00:35:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వ్యాపారం+సేవ= శ్రావ్య - EENADU
close

తాజా వార్తలు

వ్యాపారం+సేవ= శ్రావ్య

ఆమె చదివింది ·కెమికల్‌ ఇంజినీరింగ్‌ అయినా... మోడలింగ్‌లో సత్తా చాటింది. లిప్‌స్టిక్‌లు తయారుచేసి అమ్ముతూ... తద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సేవకు కేటాయిస్తోంది.  ఆమే కెనడాలో స్థిరపడ్డ తెలుగమ్మాయి శ్రావ్య కల్యాణపు.

రెండేళ్లక్రితం... శ్రావ్య ప్రజల ఓటింగ్‌ ద్వారా మిస్‌ వరల్డ్‌ కెనడా టైటిల్‌ని సొంతం చేసుకుంది. అనుకోకుండా పోటీల్లో పాల్గొన్నా అక్కడితో ఆగిపోలేదామె. చదువు, వ్యాపారం, సేవ అన్నింటినీ సమన్వయం చేసుకుంటోంది. శ్రావ్య స్వస్థలం ఖమ్మం. తండ్రి రవికుమార్‌, తల్లి పార్వతి. పదేళ్ల వయసులో కెనడా వెళ్లిన ఆమె అల్బెర్టా యూనివర్సిటీ నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. మిస్‌ కెనడా పోటీల గురించి చెల్లి మయూఖ చెప్పినా మొదట ఆసక్తి చూపలేదు. అది కేవలం అందాల పోటీ మాత్రమే కాదని, దానిద్వారా సామాజిక సేవ చేయొచ్చని కుటుంబసభ్యులు చెప్పడంతో దరఖాస్తు చేసింది. దానిలో భాగంగా మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌తో కలిసి పనిచేసింది. కుకీస్‌తోపాటు ఇతర ఆహారపదార్థాలు వండి ఇంటింటికీ వెళ్లి అమ్మి నాలుగువేల డాలర్లు సేకరించింది. ఆమె గురించిన ఆ వివరాల్నీ పోటీ నిర్వాహకులు ఆన్‌లైన్‌లో పెట్టడంతో పీపుల్స్‌ ఛాయిస్‌లో భాగంగా మిస్‌ కెనడా టైటిల్‌ని రెండేళ్ల క్రితం అందుకుంది.

పరిశోధన చేశాకే...
శ్రావ్యకు ముందు నుంచీ భిన్నంగా రాణించాలనే తపన. అందుకే స్కూల్‌ స్నేహితురాలితో కలిపి వందశాతం ఆర్గానిక్‌ లిప్‌స్టిక్‌లను తయారు చేయాలనుకుంది. ‘మనం వాడే సౌందర్య ఉత్పత్తుల్లోని చాలా పదార్థాలు పర్యావరణానికి హానిచేసేవే. అందుకే కొబ్బరి, ఆలివ్‌ నూనెలు, రంగు కోసం కొన్నిరకాల క్లేలు, వాసనకోసం పండ్లు... వంటి సహజంగా దొరికే పదార్థాల మేళవింపుతో లిప్‌స్టిక్‌లు తయారుచేయాలనుకున్నా.  చదువుకుంటూ ప్రయోగాలు చేయాలి కాబట్టి సరైన ఫార్ములా రావడానికి రెండేళ్లు పట్టింది. వీటిని సెలెస్ట్‌ లిప్‌స్టిక్స్‌ పేరుతో ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాం. ఉత్తర అమెరికాలో మాకు  వినియోగదారులు ఎక్కువ. మా మీద మాకు నమ్మకం వచ్చాక బ్రాంజర్‌, బ్లష్‌, ఐక్రీం..  వంటి ఆరు రకాల మరికొన్ని ఉత్పత్తులను వందశాతం సేంద్రియంగా తయారు చేయడం మొదలుపెట్టాం. అన్నీ మ్యాట్‌ రకాలే అవి. ప్రస్తుతం మా మార్కెట్‌ని భారత్‌లో విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నా’ అని చెబుతుంది ఆమె.

కొంత సేవకీ...
సంపాదించిన దానిలో సమాజానికి కొంత ఇవ్వాలని తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంది శ్రావ్య. మొదటి ఏడాది తనకు వచ్చిన ఆదాయంలో కొంత మొత్తంతో 200 మంది పిల్లలకు ఉచిత ఆరోగ్యపరీక్షలు చేయించింది. రక్తహీనత బారిన పడకుండా మందుల తయారీ సంస్థలతో మాట్లాడి విటమిన్‌, ఐరన్‌మాత్రలు ఇప్పించింది. రెండో ఏడాది ముంబయికి చెందిన నలభైమంది అంధ విద్యార్థులకు బ్రెయిలీ కిట్స్‌ అందించింది. ఈ ఏడాదీ దాన్ని కొనసాగించనుంది. కొన్నాళ్లక్రితం కెనడాలో లిబరల్స్‌ పార్టీ శ్రావ్య గురించి తెలుసుకుని ఎంపీగా పోటీచేయమంటూ ఆహ్వానించింది. చదువు వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నానంటుంది. సమాజానికి ఎక్కువ సేవ చేయాలంటే.. రాజకీయాలే సరైన మార్గమని, ఆ దిశగా భవిష్యత్తులో ఆలోచిస్తానంటోందామె.

లిప్‌స్టిక్‌ల తయారీ మొదలుపెట్టినప్పుడు ఓ వైపు చదువు, మరోవైపు ప్రయోగాలతో సమయం సరిపోయేది కాదు. దాదాపు 200 నుంచి 500 ఫార్ములాలు కనిపెట్టాం. కష్టపడి ఓ లిప్‌స్టిక్‌ తయారుచేస్తే వాసన బాగుండేది కాదు. లేదా విరిగిపోయేది. లోపాల్ని దిద్దుకుంటూ ఉత్పత్తిని బయటకు తీసుకొచ్చాం. ఇందుకోసం అమ్మ నుంచి కొన్ని సలహాలు తీసుకున్నాం. మామయ్య హోమియోపతీ డాక్టర్‌ కావడంతో ఆయనతోనూ మాట్లాడా. ఆయుర్వేదిక్‌ పుస్తకాలు తిరగేశా. అన్ని జాగ్రత్తలు తీసుకునే వీటిని అందుబాటులోకి తెచ్చా.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.