close

తాజా వార్తలు

పదహారేళ్లకే పెళ్లి చేయమంటోంది!

ప్రశ్న: మా చెల్లి ప్రస్తుతం ఇంటరు రెండో సంవత్సరం చదువుతోంది. తనకు 16 ఏళ్లు. వేసవి సెలవుల్లో మేనత్త వాళ్లింటికి వెళ్లి వారంపాటు ఉంది. అక్కడ ఎవరో అబ్బాయి చెల్లిని ప్రేమిస్తున్నాడట. తనతో పెళ్లి చేయమని గొడవ చేస్తోంది. కాలేజీకి వెళ్లనంటోంది. ఎంత చెప్పినా వినడం లేదు. తనను మార్చేదెలా?

- ఓ సోదరి

జవాబు: పదహారేళ్ల ప్రాయంలో పిల్లల మానసిక స్థితిపై హార్లోన్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా తమను ఇష్టపడి, పెళ్లి చేసుకుంటామంటే ఆ మాటలు నమ్మి తీవ్రంగా ప్రవర్తిస్తుంటారు. మీ చెల్లిది సున్నిత మనస్తత్వం కావచ్చు. అందుకే ఇప్పుడే పెళ్లి చేయమని మారాం చేస్తోంది. చాలామటుకు ఒక అమ్మాయి,  ‘నన్ను అర్థం చేసుకుంటున్నాడు... నాతో బాగా మాట్లాడుతున్నాడు’ అనే కారణాలతో ప్రేమలో పడ్డట్టు ఊహించుకుంటుంది. ఆ ఊహలకు సినిమాలు, సామాజిక మాధ్యమాల ప్రభావం తోడవుతాయి. మీరు ఆమెను మందలించకుండా ఓర్పుగా చెప్పే ప్రయత్నం చేయండి. 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న అమ్మాయికి, 21 ఏళ్లు నిండని అబ్బాయికి పెళ్లి చేయడం నేరం. దీనికి చట్టం అంగీకరించదు. వధూవరులకు, వారి తల్లిదండ్రులకు శిక్ష పడుతుందని కచ్చితంగా చెప్పండి. ఒకవేళ ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నా సరే అది చెల్లదని అర్థమ య్యేలా వివరించండి. ఇద్దరూ జీవితంలో స్థిరపడ్డాక ఒకరిమీద మరొకరికి ఇష్టం ఉంటే అప్పుడు పెళ్లి చేస్తామని నచ్చజెప్పండి. అబ్బాయి వాళ్ల తల్లిదండ్రులతోనూ గొడవ పెట్టుకోకుండా ఒకసారి మాట్లాడండి. అతడికి నచ్చజెప్పమని కోరండి. సాధారణంగా తల్లిదండ్రులు అమ్మాయిని కొట్టడం, సెల్‌ఫోన్‌ లాక్కోవడం చేస్తుంటారు. పిల్లలు ఏం ఆలోచించకుండా ఇంట్లో నుంచి పారిపోవచ్చు. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడవచ్చు. ఇలాంటి సమస్యలు ఎదురుకాకూడదంటే... ప్రేమతో చెప్పడమే మేలు. ఈ వయసులో ఇది సహజం కాబట్టి మీరూ ఓర్పుగా ఉండండి. ప్రస్తుతం స్నేహితులుగా మెలగమని సలహా ఇవ్వండి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచించండి. ఇంట్లో పెద్దల మాట వినకపోతే మానసిక నిపుణుల దగ్గరికి తీసుకెళ్లండి. వారు పిల్లలకు అర్థమయ్యేలా వివరిస్తారు. అబ్బాయి గురించీ చెడుగా ఆలోచించకండి. తొందరపడి తీవ్రంగా ప్రవర్తిస్తే అమ్మాయికే నష్టం జరుగుతుందనే విషయం గుర్తుంచుకోండి.

మీ ప్రశ్నలు ఇకపై vasupsych@eenadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.