Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 120885
            [news_title_telugu_html] => 

కంటి ఆరోగ్యానికి సహజ కాటుక

[news_title_telugu] => కంటి ఆరోగ్యానికి సహజ కాటుక [news_title_english] => [news_short_description] => ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఒక్కోసారి కళ్లు మంటలు పుడతాయి. దురద, ఎర్రబడటం, నీరు కారడం, నిద్రలేవగానే రెప్పలు అతుక్కుపోవడం వంటి సమస్యలు సాధారణంగానే ఎదురవుతాయి. అలాంటివాటికి ఏం చేయాలో చూద్ద్దామా... [news_tags_keywords] => Eye Beauty, Home remedy, Vasundhara [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-04 01:32:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కంటి ఆరోగ్యానికి సహజ కాటుక - EENADU
close

తాజా వార్తలు

కంటి ఆరోగ్యానికి సహజ కాటుక

ఇంటివైద్యం

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఒక్కోసారి కళ్లు మంటలు పుడతాయి. దురద, ఎర్రబడటం, నీరు కారడం, నిద్రలేవగానే రెప్పలు అతుక్కుపోవడం వంటి సమస్యలు సాధారణంగానే ఎదురవుతాయి. అలాంటివాటికి ఏం చేయాలో చూద్ద్దామా...
ఎండ, వేడి, పొగ, దుమ్ము, ధూళి వంటివి కళ్లకు హాని చేస్తాయి. వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. కంటి అందానికి రసాయన పదార్థాలతో తయారయ్యే సౌందర్య ఉత్పత్తులు వినియోగించకూడదు. కంప్యూటర్‌, టీవీ, మొబైల్‌ స్క్రీన్లను ఎక్కువ సమయం చూడటమూ మంచిది కాదు. వాటిని అదేపనిగా చూస్తే... కళ్లల్లో సహజసిద్ధంగా ఉండే తేమ తగ్గి, పొడిబారతాయి. ఏకాగ్రతగా చదువుతున్నప్పుడు లేదా ఏదైనా చూస్తున్నప్పుడు అప్పుడప్పుడూ కను రెప్పలను మూసి తెరుస్తూ ఉండాలి. తడి ఆరకుండా ఉంటాయి. కళ్లని అపరిశుభ్రమైన చేతులతో తాకకూడదు. అదేపనిగా రుద్దకూడదు. కంటి ఆరోగ్యానికి ఆహారంలో చలవ చేసే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కీరదోస, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. కారం, గరం మసాలాలు తగ్గించాలి. అతి తక్కువ లేదా ఎక్కువ వెలుగు మంచిది కాదు.

కాటుక తయారీ...

ట్టి ప్రమిద లేదా వెండి దీపం కుందులో మంచి ఆముదం పోసి వత్తి వేసి దీపం వెలిగించాలి. ఈ దీపానికి తగిలేలా వెండి లేదా ఇత్తడి పళ్లాన్ని బోర్లించి ఉంచాలి. ఆముదం అయిపోయిన తరువాత పళ్లానికి ఏర్పడిన నల్లని మసిని ఒక పరిశుభ్రమైన భరిణెలోకి తీసుకోవాలి. చిటికెడు పచ్చకర్పూరం, తగినంత ఆవు నెయ్యిని ఈ మసికి కలిపితే కాటుక తయారవుతుంది. ఎలాంటి హానికర రసాయనాలు లేని ఈ కాటుక కంటికి ఆరోగ్యాన్నిస్తుంది. నిత్యం దీన్ని వినియోగించుకోవచ్చు.

ఇలా చేసి చూడండి...

* గ్లాసు నీటిని మరిగించి అందులో గుప్పెడు ఎర్ర గులాబీ రేకలు వేసి మూత పెట్టాలి. ఓ పూట గడిచాక ఈ నీటిని వడకట్టాలి. దూది లేదా పల్చని, తెల్లని పరిశుభ్రమైన మెత్తని వస్త్రాన్ని మడత పెట్టి గులాబీ నీటిలో ముంచి కంటిపై ఉంచుకోవాలి. పది నిమిషాలు విశ్రాంతినివ్వాలి. ఎరుపు, కళ్ల మంటలు తగ్గి, కంటికి చలవ చేస్తుంది.
* కప్పు నీటిలో చెంచా మంచి పసుపు వేసి మరగనిచ్చి తెల్లని వస్త్రాన్ని నాలుగు పొరలుగా మడిచి అందులో వడకట్టాలి. ఇందులో దూది లేదా వస్త్రాన్ని ముంచి కంటిపై ఉంచి 10 నిమిషాలయ్యాక తీసేయాలి. కంటి ఎరుపు, దురదలు తగ్గడానికి ఇది మంచి మార్గం. ఈ పద్ధతిని కళ్ల కలకలకూ వినియోగించవచ్చు.
* మజ్జిగ లేదా పెరుగులో దూది ముంచి, కంటిపై పది నిమిషాలపాటు పెట్టినా... కళ్ల మంటలు, ఎరుపు తగ్గుతాయి.

మీ ప్రశ్నలు ఇకపై vasuayur@eenadu.net కు పంపించగలరు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.