Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 130358
            [news_title_telugu_html] => 

చినుకుల్లో చుక్కల్లా...

[news_title_telugu] => చినుకుల్లో చుక్కల్లా... [news_title_english] => [news_short_description] => కాలం ఏదైనా ఓ చిన్న సందర్భం ఎదురైతే చక్కగా అలంకరించుకోవాలని అనుకుంటాం. వర్షా కాలంలో కొద్దిగా వర్షం పడితే చాలు... అలంకరణ చికాకు పెడుతుంది. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే.. కొన్ని  జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...! [news_tags_keywords] => face pack, makeup, rain season, vasundhara [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-23 00:33:54 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చినుకుల్లో చుక్కల్లా... - EENADU
close

తాజా వార్తలు

చినుకుల్లో చుక్కల్లా...

కాలం ఏదైనా ఓ చిన్న సందర్భం ఎదురైతే చక్కగా అలంకరించుకోవాలని అనుకుంటాం. వర్షా కాలంలో కొద్దిగా వర్షం పడితే చాలు... అలంకరణ చికాకు పెడుతుంది. అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే.. కొన్ని  జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే...!

కాలంలో అప్పటికప్పుడు మేకప్‌ చేసుకోవడం సరికాదు. అలంకరణకు చర్మాన్ని సిద్ధం చేయాలి.  ఎలాగంటే... రెండు పెద్ద చెంచాల బొప్పాయి గుజ్జులో చెంచా తేనె, కొంచెం  నిమ్మరసం కలిపి చర్మానికి రాసుకోండి. మృదువుగా మునివేళ్లతో రుద్ది, ఆరాక కడిగేయండి. ముఖం తాజాగా ఉంటుంది.
* అలంకరణకు ముందు కచ్చితంగా మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. అప్పుడే అది చర్మాన్ని మేకప్‌నకు అనుకూలంగా మారుస్తుంది. లేదంటే మేకప్‌ చేసుకున్న కాసేపటికే ముఖం జిడ్డుగా మారుతుంది.
* వారంలో రెండుసార్లు ముఖాన్ని క్లెన్సింగ్‌ మిల్క్‌తో శుభ్రం చేయాలి. ఐసుముక్కను ముఖానికి రాసుకోవడం వల్ల అధిక జిడ్డు సమస్య ఉండదు. అలంకరణ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది.  జిడ్డుచర్మ తత్వం ఉన్నవారు ఆయిల్‌ఫ్రీ మాయిశ్చరైజర్‌ని ఎంచుకోవాలి.
* చినుకులు పడుతున్నప్పుడు వీలైనంతవరకూ  వాటర్‌బేస్డ్‌ ఉత్పత్తుల్ని ఎంచుకోవాలి. లేదంటే   చర్మ రంధ్రాలు పూడుకుపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ కాలంలో ఫౌండేషన్‌ వాడకపోవడమే మంచిది. ఫౌండేషన్‌కు బదులు మేకప్‌ బేస్‌లోనూ కాస్త తేలికైన పౌడర్‌ని ఎంచుకోవాలి. అదీ చాలా తక్కువగానే వాడాలి.

ప్రైమర్‌ అవసరమే:  కళ్లకు మేకప్‌ చేసుకునే ముందు ప్రైమర్‌ని వాడటం తప్పనిసరి. ప్రైమర్‌ ముఖం మీద దుమ్ము, నీరు లాంటివి నిలిచిపోకుండా రక్షణ పొరలా పనిచేస్తుంది. కాబట్టి ఒకదాన్ని అందుబాటులో ఉంచుకోవడమే మంచిది.
* గోధుమరంగులో పలుచగా ఉండే ఐషాడోలు ఈ కాలంలో బాగుంటాయి. క్రీమ్‌ బేస్డ్‌ ఐషాడో వేసుకుంటే కళ్లు పెద్దవిగా కనిపిస్తాయి. బ్లష్‌కోసం లేత వర్ణాలైన పీచ్‌, పింక్‌ వంటివి నప్పుతాయి. ఒకవేళ ఐలైనర్‌ వేస్తే అది సైతం వాటర్‌ ప్రూఫ్‌ది అయ్యి ఉండాల్సిందే. ఒకటి రెండు కోట్‌లలో ఎంచుకోవడం మేలు.
* లిప్‌గ్లాస్‌ క్లాసిక్‌గా ఉంటుందని తెలిసిందే. ఇది ఈ కాలంలో మాత్రం అంతగా నప్పదు. గ్లాసీ, క్రీమీ లిప్‌స్టిక్‌లు వర్షానికి చెదిరి కారిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు సాఫ్ట్‌మ్యాటీ లిప్‌స్టిక్‌లను ఎంచుకోవాలి. లిప్‌పెన్సిల్‌తో అవుట్‌లైన్‌ గీసుకున్న తరువాత లిప్‌స్టిక్‌ వేసుకోవడం మంచిది.
* వాటర్‌ప్రూఫ్‌ మస్కారా, ఐలైనర్‌ వాడుకునే ముందు కళ్లను తేమగా ఉంచుకోవాలి. పెన్సిల్‌ క్రీమ్‌లా ఉంటుంది కాబట్టి ఇది మీ కళ్లకు అందాన్ని తెచ్చిపెడుతుంది. నలుపు రంగుకి బదులు గోధుమ రంగు ఉండేలా చూసుకోవాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.