
తాజా వార్తలు
జైప: ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌కు చెందిన ఒక ప్రేమ జంట ఒక్కటైన విషయం వెలుగులోకి వచ్చింది. కశ్మీర్ యువతులు ఇతర రాష్ట్రాల యువకులను వివాహమాడేందుకు మార్గం సుగమం కావడంతో తాజాగా ఓ కశ్మీర్ యువతి రాజస్థాన్‌కు చెందిన యువకుడిని పరిణయమాడింది. కశ్మీర్ పట్ల మోదీ సర్కార్ తీసుకున్న సంచలన నిర్ణయం తరువాత ఇతర రాష్ట్రాలకు చెందిన ఓ వ్యక్తి కశ్మీరీ అమ్మాయిను పెళ్లి చేసుకోవడం ఇదే తొలిసారి. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కి చెందిన అక్షయ్ కొన్నాళ్ల క్రితం దిల్లీలో ఉద్యోగం చేశాడు. అదే సమయంలో కశ్మీర్‌కు చెందిన కామినీ రాజ్‌పుత్ అనే యువతి కూడా అదే ప్రాంతంలో ఉన్న తన అత్త ఇంట్లో ఉండేది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమగా మారింది. కానీ అప్పటికే కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా ఆ రాష్ట్ర అమ్మాయిలు వేరే రాష్ట్ర యువకులను పెళ్లి చేసుకోవడం కష్టంగా ఉండేది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే వారికున్న ప్రత్యేక హక్కులను కోల్పోయేవారు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో ఆర్టికల్ 370 అడ్డుతొలగిపోయింది. దీంతో రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ప్రేమను పెళ్లిగా మలచి ఒక్కటయ్యారు. సామాజిక వర్గాలు వేరైనా ఇరుకుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహ విందు వేడుకను అక్టోబరులో ఘనంగా నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. జమ్ముకశ్మీర్ నుంచి వచ్చే వధువు బంధువుల కోసం వరుడు కుటుంబీకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
