close

తాజా వార్తలు

ఖర్చులేకుండా...కొవ్వు కరిగిద్దాం

వ్యాయామం వల్ల బోలెడు లాభాలున్నాయని తెలిసినా... కొందరు గృహిణులకు ఆ సమయమూ ఉండదు. ఇలాంటివారు ఇంటిపనులన్నీ అయ్యాకే కాదు... కుదిరినప్పుడల్లా ఈ వ్యాయామాలు చేసేందుకు ప్రయత్నించొచ్చని చెబుతున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు.

సైకిలు: ఏ వయసు మహిళలైనా దీన్ని ప్రయత్నించొచ్చు. నడుము కిందిభాగం తగ్గాలనుకునేవారు రోజులో పదిహేను నిమిషాలు సైకిలు తొక్కినా చాలు... మార్పు కనిపిస్తుంది. ఏరోబిక్‌  సైకిలే కాదు, సాధారణ రకాన్నీ అప్పుడప్పుడూ తొక్కొచ్చు.
పరుగు/నడక: ఈ రెండింటిలో ఏది ఎంచుకున్నా... ఎక్కువ కెలొరీలు కరగడమే కాదు, కండరాలూ దృఢంగా మారతాయి. ఆరునెలలు లక్ష్యం పెట్టుకుని రోజుకో అరగంట నడిచినా, పరిగెత్తినా... ఫలితం  కనిపిస్తుందని అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. కొన్నిరకాల అనారోగ్యాలూ వీటితో దూరమవుతాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
క్రంచెస్‌: వీటినీ ఇంట్లోనే చేయొచ్చు. వెల్లకిలా పడుకొని... మోకాళ్లను మడిచి... తలకింద చేతులు పెట్టుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా తలను వీలైనంత పైకెత్తే ప్రయత్నం చేస్తే ఆ భారం పొట్టపై పడుతుంది. కనీసం ఇరవై నుంచి నలభైసార్లు రోజూ చేస్తే పొట్ట దగ్గర పేరుకొన్న కొవ్వు తగ్గుతుంది.

తాడాట/మెట్లెక్కడం: తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలనిచ్చే వ్యాయామాలివి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి. ఈ రెండింటితో పూర్తి శరీరానికి వ్యాయామం అందించినవారవుతారు.
యోగా: వ్యాయామం కంటే ఉత్తమమైన ఫలితాలను ఇస్తుందిది. రకరకాల ఆసనాలు మొత్తం శరీరంపై ప్రభావం చూపుతాయి. మెదడు పనితీరూ చురుగ్గా ఉంటుంది. శరీరమంతటికీ ప్రాణవాయువు అందుతుంది. సమస్యల్ని బట్టి, ఆసనాలను ఎంచుకుంటే ఏ ఇబ్బందీ ఉండదు. ఒకసారి నిపుణుల సలహా తీసుకోవడం మాత్రం తప్పనిసరి.
స్క్వాట్స్‌:  వీటి వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అందుతుంది. పొట్టకు ఇరువైపులా పేరుకొనే కొవ్వు చాలా తేలికగా కరుగుతుంది. కెలొరీలూ బాగా ఖర్చవుతాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.