close

తాజా వార్తలు

Updated : 05/09/2019 00:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పొదుపు కళ నేర్చుకుందామా!

డబ్బుని పొదుపు చేయడం ఓ కళ. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటేనే కానీ అది సాధ్యం కాదు. ఎంతో క్రమశిక్షణ ఉండాలి. ఎలాగో చూడండి మరి.

* డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారనే స్పష్టత  మొదటినుంచీ ఉండాలి. ఇలా చేస్తే ఆదాయంలో ఎక్కువ మొత్తం ఎక్కడ వెచ్చిస్తున్నారో తెలుసుకోగలుగుతారు. అవసరానికి, విలాసానికి మధ్య ఉన్న తేడా తెలిసుండాలి. ఆ స్పష్టత వస్తే... అవసరం అనుకున్న వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగలుగుతారు. ఈ జాగ్రత్త తీసుకుంటే ఎంతో మొత్తం ఆదా చేయగలుగుతారు. ఖర్చులకు సంబంధించిన యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించి చూడండి.
* షాపింగ్‌లకు వెళ్లేముందు మీరేం కొనాలనుకుంటున్నారో ముందే ఒక జాబితా తయారు చేసుకోండి. అనవసరమైన వాటిని కొనడం చాలామటుకూ తగ్గించొచ్చు. బిల్లులను కార్డు రూపంలో కాకుండా నగదు రూపంలో చెల్లించడానికి ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుడే ఖర్చుపై నియంత్రణ ఉంటుంది. ఎక్కడెంత ఖర్చు చేస్తున్నామో సులువుగా గ్రహించవచ్చు. కార్డు రూపంలో అయితే ఎంత మొత్తం ఖర్చు చేస్తామో బ్యాంకు స్టేట్‌మెంట్‌ వచ్చే వరకు చెప్పలేం.
* చేతిలోకి జీతం వచ్చిన తొలిరోజే ఎంతో కొంత పొదుపు చేయడం ఉత్తమం. ఇలా కొంత కాలం పాటు చేస్తే ఆ డబ్బు మీకు అవసరం అయినప్పుడు ఉపయోగపడుతుంది. అధిక రాబడినిచ్చే రకరకాల ఆర్థిక పథకాలు అందుబాటులో ఉన్నాయి. నిపుణుల సలహాతో అందులో మదుపు చేయండి.
* ఆర్థికంగా కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసుకోండి. పెళ్లి, చదువు, విహార యాత్రలు... ఇలా ఒక ఏదో ఒకదాని కోసం డబ్బు ఆదా చేయడం అలవాటుగా పెట్టుకోండి. ఆర్థికంగా ఎదగడానికి ఈ లక్ష్యాలు ఎంతో మేలు చేస్తాయి.
* ఒక వస్తువు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఆన్‌లైన్‌లో కొన్ని సందర్భాల్లో చాలా వస్తువులు తక్కువ ధరలో లభ్యం అవుతాయి. పండగ వేళల్లో మరికొన్నింటినీ ఆఫర్లలో విక్రయిస్తారు. ఇటువంటి సందర్భాల్లో ఖరీదైన వస్తువులు కొనండి. చాలా వరకూ ఖర్చు తగ్గుతుంది.
* అనారోగ్యం పాలైనప్పుడు అధికమొత్తంలో ఖర్చు కావడం మామూలే. దాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. అదొక్కటే కాదు... ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకోవడం చాలా అవసరం.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని