
తాజా వార్తలు
మా బాబు వయసు పదేళ్లు. ఇంటికి వచ్చిన స్నేహితులు, బంధువుల్ని డబ్బులు అడుగుతున్నాడు. ఇది మాకు చాలా అవమానంగా అనిపిస్తోంది. చిన్నవాడు కదా తనని కోప్పడటం లేదు. ఈ అలవాటును ఎలా మాన్పించాలి?
- ఓ సోదరి
మీ బాబుకి పదేళ్లు వచ్చినా అమ్మానాన్నల్ని కాకుండా ఇతరులను డబ్బులు అడగకూడదనే విషయం తెలియట్లేదు. సామాజికంగా తనకు లోకజ్ఞానం తక్కువని అనిపిస్తోంది. దీనికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఇలాంటి చిన్నారుల్లో కొంచెం బుద్ధిమాంద్యం సైతం ఉండే అవకాశం ఉంది. ఇలా ప్రవర్తించే పిల్లలకు తెలివితేటలు తక్కువగా ఉంటాయి. వారికి తన, పర అనే భేదం ఉండదు. ఇంట్లో అమ్మానాన్నలను అడిగినట్లే బయటివారిని అడిగేస్తారు. ప్రవర్తనాపరమైన సమస్యలున్న చిన్నారులూ ఇలా ప్రవర్తించే అవకాశం ఉంటుంది.
మరికొందరు తల్లిదండ్రులు అడిగినవి ఇవ్వడం లేదని వారిని బెదిరించడానికి ఇలా చేస్తుంటారు. వారి ముందే బంధువులను, స్నేహితులను తమకు కావాల్సినవి అడుగుతుంటారు. ఇలా చేస్తే అమ్మానాన్నలకు అమర్యాదగా అనిపించి తప్పకుండా ఇస్తారని వీరి నమ్మకం. ఇదో రకమైన బెదిరింపు చర్య. ఇదీ ప్రవర్తనాపరమైన సమస్యే. బుద్ధిమాంద్యం ఉన్న చిన్నారులూ ఇలా చేసే అవకాశం ఉంది.
మీరేం చేయాలంటే... బాబును ఓసారి సైక్రియాటిస్ట్ లేదా సైకాలజిస్ట్‌కు దగ్గరకు తీసుకువెళ్లండి. దాంతో వారు అతడి ప్రవర్తన గురించి విశ్లేషిస్తారు. సామాజికంగా ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండకూడదో బిహేవియర్ మాడిఫికేషన్ పద్ధతుల ద్వారా నేర్పిస్తారు. రెండోది...పిల్లాడికి డబ్బుల అవసరం ఏంటో తెలుసుకోండి. ఎవరిని అడగకుండా ఉంటే... డబ్బులే కాదు...తనకు కావాల్సినవన్నీ కొనిస్తానని చెప్పాలి.
మూడోది... ‘నువ్వు అందరినీ డబ్బులు అడుగుతుంటే... ఎదుటివారు నిన్ను తక్కువగా చూస్తారు. మానసికంగా నువ్వు సరిగా లేవనుకుంటారు. నిన్ను దూరంగా పెడతారు’ అని అతడి ప్రవర్తన ఎలాంటి చెడు ఫలితాల్ని ఇస్తుందో వివరించాలి. అతడు ఎలా ఉండాలో...మీరే దగ్గరుండి నేర్పించాలి. దానికి అమ్మానాన్నలకు ఓపిక అవసరం.
- మీ సందేహాలను vasukid@eenadu.net కు పంపించగలరు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- పార్లమెంట్‌కు చిదంబరం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
