
తాజా వార్తలు
చాలామంది ఎంత బాగా తయారైనా కళ్లజోడు తమ లుక్‌ని మార్చేస్తుందని బాధపడుతుంటారు. దానికి ప్రత్యామ్నాయం లెన్స్. అలాగని రోజుల తరబడి వాటిని వాడుతుంటే... కళ్లు పొడిబారొచ్చు. అద్దాలు ఉన్నా...మీరు మెరిసిపోవాలంటే...ఈ మెలకువలు పాటిస్తే సరి.
* వీలైనంతవరకూ జుట్టుని వదిలేసుకునే బదులు... జడ వేసుకోవడమే మేలు. అలాని మరీ బిగుతుగా కాకుండా ఫ్రెంచ్ బ్రెయిడ్, ఫిష్‌టెయిల్ వంటివి ప్రయత్నిస్తే... స్టైలిష్ లుక్ మీ సొంతం అవుతుంది.
* కళ్లద్దాలు పెట్టుకున్నప్పుడు కనుబొమలను తీర్చిదిద్దుకోవడం తప్పనిసరి. సన్నటి ఫ్రేమ్ వాడినప్పుడు కనుబొమల్ని మరీ దట్టంగా దిద్దొద్దు. అదే మందంగా ఉన్నవి వాడేటప్పుడు మాత్రం విల్లు ఆకృతిలో ఐబ్రోపెన్సిల్‌తో దిద్దుకోండి. దీనివల్ల మీ ముఖాకృతి చక్కగా కనిపిస్తుంది.
* కళ్లజోడు పెట్టుకున్నప్పుడు ఐషాడో అంత అందంగా అనిపించదు. కంటికి పెట్టుకునే లైనర్ మాత్రం కాస్త మందంగా ఉంటే... అద్దాల్లోంచి కళ్లు విశాలంగా కనిపిస్తాయి. అవుట్‌లైన్ కొత్తగా కనిపించేలా చేస్తుంది. నలుపు, బ్రౌన్ వంటి రంగులతో పాటు తెలుపు, గోధుమ వర్ణాల్నీ ప్రయత్నించొచ్చు.
* కళ్లు పెద్దగా కనిపించేందుకు మస్కారా అవసరం. మేకప్ మరీ అతిగా ఉండకుండా చూసుకోవడం తప్పనిసరి. పెదాలకు కాస్త ముదురు రంగు లిప్‌స్టిక్ బాగుంటుంది. చెవులకు స్టడ్స్ మాత్రమే కాదు... జుంకాలూ నప్పుతాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
