close

తాజా వార్తలు

వైద్యపరీక్షలకు వెళుతున్నారా...

ఒంట్లో నలతగా ఉండి, వైద్యుడి వద్దకు వెళుతున్నారా... అక్కడ చేసే కొన్ని పరీక్షల కోసం ఈ కింది సూచనలు పాటించాలంటున్నారు వైద్యనిపుణులు. అవేంటంటే...

కాఫీ, టీలు వద్దు: రక్తపోటు పరీక్ష చేయించుకునే ముందు కాఫీ, కెఫీన్‌ ఉండే ఇతర పానీయాలు తీసుకోకూడదు. రక్తపోటు కొంత పెరగొచ్ఛు

మాత్రలు వేసుకోకూడదు: జలుబు, జ్వరం వంటి అనారోగ్యంతో వైద్యుని వద్దకు వెళుతున్నప్పుడు ఎటువంటి ఔషధాలనూ తీసుకోకూడదు. సొంత వైద్యం వాడితే దుష్ప్రభావాలే ఎక్కువ. మీ అనారోగ్యాన్ని డాక్టర్‌ గుర్తించలేకపోవచ్ఛు ఒకవేళ ఏదయినా మాత్ర వేసుకున్నా... ఆ వివరాలను వైద్యులకు చెప్పాలి.

పెడిక్యూర్‌ వద్దు: చర్మానికి సంబంధించిన అలర్జీ, ఇతర అనారోగ్య సమస్యలతో చర్మవైద్య నిపుణులను సంప్రదిస్తుంటే... అక్కడికి వెళ్లేముందు మెనిక్యూర్‌, పెడిక్యూర్‌ వంటివి చేయించుకోకూడదు. సాధారణంగా వైద్యులు గోళ్లను చూసి అనారోగ్యాన్ని అంచనా వేస్తారు. అలాంటప్పుడు రంగు వేస్తే... తెలుసుకోలేకపోవచ్ఛు

తీపి పదార్థాలకు దూరంగా : కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకునే ముందు తీపి, అధిక కొవ్వు ఉండే పదార్థాలను తినకుండా వెళ్లాలి. ఆహారాన్నీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు. రక్తంలోని ట్రైగ్లిజరాయిడ్‌ స్థాయుల్ని గుర్తించడం కష్టం కావొచ్ఛు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.