జంప్‌సూట్‌... జోరేవేరు
close

తాజా వార్తలు

Updated : 24/09/2019 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జంప్‌సూట్‌... జోరేవేరు

మొన్న ఓ బేబీలో సమంత, నిన్న పీవీసింధు... జంప్‌సూట్‌లో మెరిసిపోయారు. రెట్రో, కాంటెంపరరీ... పేరేదైనా వీటిదే హవా! ట్రెండీలుక్‌తో స్టైలిష్‌ డిజైన్లతో సందడి చేస్తోన్న వీటిని ఎలా ఎంచుకోవచ్చంటే...

జంప్‌సూట్‌నే ప్లేసూట్‌, ర్యాంపర్‌ అనీ అంటారు. ఈ తరహా దుస్తులను క్యాజువల్‌, పార్టీ, ఆఫీస్‌వేర్‌గానూ వేసుకోవచ్చు. దీన్ని ఎంచుకుంటే శరీరాకృతి చక్కగా కనిపిస్తుంది. ఇందులో డస్టీగ్రీన్‌, బ్లూ, మెరూన్‌ వంటి రంగులకు ఇప్పుడు ఆదరణ ఎక్కువ. వీటిల్లోనూ బెల్‌, స్ట్రెయిట్‌ కట్‌ వంటివీ కాఫ్‌లెంగ్త్‌, త్రీఫోర్త్‌ రకాల్నీ ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. ఈ డ్రెస్‌ ఎక్కువసేపు వేసుకోవాల్సి వస్తే... సిల్కుకి ప్రాధాన్యం ఇవ్వకూడదు. లెనిన్‌, నూలు, డెనిమ్‌ వంటి వస్త్రాలతో తయారు చేసిన జంప్‌సూట్లు సౌకర్యం.

* బెల్ట్‌తో ప్రత్యేకంగా...
ఆపాదమస్తకం ఒకటే పీస్‌ ఉండే వీటికి నడుము దగ్గర ఎలాస్టిక్‌ ఉంటుంది. స్టైలిష్‌ లుక్‌ కోసం ఫ్యాబ్రిక్‌, మెటాలిక్‌, ఫంకీ బెల్ట్‌లను ఉపయోగించొచ్చు. అప్పుడే శరీరాకృతీ స్పష్టంగా తెలుస్తుంది. సాదా రంగులు, నిలువు గీతలు, ప్రింట్లు వంటివే కాదు... ఇప్పుడు కొత్తగా ఎంబ్రాయిడరీ రకాలూ వస్తున్నాయి. ఎత్తు తక్కువగా ఉండేవారు నిలువుగీతల్ని, సన్నగా ఉండేవారు పెద్ద పూల డిజైను ఉన్న జంప్‌సూట్లని ఎంచుకోవచ్చు. క్రాస్‌ఓవర్‌ రకాల్ని భుజాలు కాస్త వెడల్పుగా ఉన్నవారు ప్రయత్నించొచ్చు. ఆఫీసులకు వెళ్లేవారికోసం ప్రత్యేకమైన రకాలూ ఉన్నాయి. లేదంటే దానిపై ఓ బ్లేజర్‌ని వేసుకున్నా చాలు. భిన్నంగా కనిపిస్తారు. కాస్త లావుగా ఉన్నవారు మరీ వదులుగా, శరీరానికి మరీ పట్టేసినట్లు ఉన్నవి కాకుండా ఎంచుకోవాలి.  దీనిమీదకు  చేతికి బ్రేస్‌లెట్‌, చెవులకు దిద్దులు పెట్టుకుని జుట్టు వదిలేసుకుంటే బాగుంటుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని