
తాజా వార్తలు
కోళికోడ్ (కేరళ): అది కేరళలోని కోళికోడ్. ఓ ఉమ్మడి కుటుంబం. ఆనందమయ జీవితం. అలాంటి కుటుంబంలో 2002లో అనుకోకుండా విషాదం నెలకొంది. ఆ ఇంటి పెద్దావిడ అన్నమ్మ థామస్ (57) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది. సరిగ్గా ఆరేళ్లకు 2008లో ఆమె భర్త టామ్ థామస్ (66) సైతం ఏదో తింటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటుతో చనిపోయారని అందరూ భావించారు. 2011లో ఆ వృద్ధ దంపతుల కుమారుడు.. రాయ్ థామస్ (40) చనిపోయాడు. అతడి పోస్టుమార్టం నివేదికలో సైనేడ్ ఉన్నట్లు తేలింది. అతడి మృతిపట్ల అనుమానం వ్యక్తంచేసిన అన్నమ్మ థామస్ సోదరుడు మాథ్యూస్ (68) సరిగ్గా మూడేళ్ల తిరగకముందే 2014లో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే అతడూ చనిపోయాడు. 2016లో టామ్ థామస్ బంధువైన సిలీ కుమార్తె ఆల్ఫిన్ (2) మరణించింది. కొద్ది నెలల వ్యవధిలోనే సిలీ (27) కూడా చనిపోయింది.
మొత్తం 14 ఏళ్లు.. 6 మరణాలు. అందరూ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. క్రైమ్ థ్రిల్లర్ తలపిస్తున్న ఈ ఘటనలో అనుకోని మలుపు తిరిగింది. 2011లో చనిపోయిన రాయ్ థామస్ భార్య జాలీ, చివర్లో చనిపోయిన సిలీ భర్త వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ కుటుంబ ఆస్తి వారి పరమైంది. ఇంతకీ ఆ కుటుంబ సభ్యులందరిదీ సహజ మరణమేనా?అన్న అనుమానం ఆ కుటుంబాన్ని దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరిలోనూ కలగక మానదు. ఇదే అనుమానం అమెరికాలో ఉంటున్న టామ్ చిన్నకుమారుడు మోజోకు కూడా కలిగింది. ఆస్తి బదలాయింపు సహా వరుస మరణాలపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ఇంటి కోడలే ఈ హత్యలన్నీ చేసిందని తేలింది.
ఆస్తికోసం..
ఆ ఇంటి ఆస్తి వ్యవహారాలన్నీ అన్నమ్మ చేతిలో ఉండడంతో తొలుత జాలీ ఆమెను హతమార్చింది. దీంతో ఆ ముసలావిడ భర్త టామ్ ఆస్తిలో కొంత వాటాను జాలీ దంపతులకు రాసిచ్చాడు. అంతటితో సంతృప్తి పడని జాలీ మరింత కావాలని ఆశపడింది. ఈ నేపథ్యంలో భర్తతో తగాదాల వల్ల అతడిని హతమార్చింది. భర్త పోస్టుమార్టం నివేదికలో సైనేడ్ ఉందని అనుమానించిన మాథ్యూస్‌ను కూడా చంపింది. షాజును వివాహం చేసుకునేందుకు అడ్డుగా ఉన్నారని భావించి ఆల్పైన్, సిలీని చంపింది. ఇలా ఆస్తి కోసం ఒకరి తర్వాత ఒకరు చొప్పున మొత్తం 14 ఏళ్లలో ఆరుగురిని హతమార్చింది.
అందరినీ ఒకేలా..
తమకొచ్చిన ఫిర్యాదు మేరకు పలుమార్లు జాలీ, షాజును విచారించిన పోలీసులు వారు పొంతనలేని సమాధానం చెప్పడాన్ని గ్రహించారు. దీనికి తోడు వారిద్దరూ పలు సందర్భాల్లో ఫోన్లో మాట్లాడుకోవడాన్ని గుర్తించారు. చివరికి ఆ ఆరు మృతదేహాలను పరీక్షించిన అనంతరం వారందరి శరీరాల్లోనూ సైనేడ్ అవశేషాలు కనిపించాయి. వీరందరినీ స్లోపాయిజన్ ద్వారా చంపినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తమదైన శైలిలో జాలీని విచారించడంతో ఈ హత్యలన్నీ చేసింది తానేని అంగీకరించింది. దీంతో ఆమెతో పాటు ఈ కుట్రకు సహకరించిన మరో ఇద్దరిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
