
తాజా వార్తలు
ప్రముఖ పర్షియా కవి ఉమర్ ఖయ్యూమ్ కవితలను స్ఫూర్తిగా తీసుకుని చిత్రాలుగా మారిస్తే... ఆ అందమే వేరు. అలాంటి చిత్రాలతో ఆవిష్కరించిన దుస్తుల సమాహారమే ఈ వస్త్రశ్రేణి. భిన్నమైన రంగులపై కనికట్టు చేస్తోన్న పూల డిజైన్ల దుస్తులు... ప్రత్యేక సందర్భాలకు అనువుగా ఉంటాయి. మీరూ ప్రయత్నించి చూడండి.
పూల బొకేలు, డిజిటల్ ప్రింట్లున్న కాటన్ చీర... టై అండ్ డై అంచు... కుచ్చుల రవిక కోకందాన్ని పెంచుతోంది. |
కాటన్ ఎసెమెట్రికల్ పొడవాటి కుర్తీపై... వికసిస్తున్న మొగ్గల మోటిఫ్‌లు, లేయర్ల ప్రత్యేకతలు... ఎంచుకుంటే అందమే వేరు. |
గులాబీ రంగు కాటన్ చీరపై పూ మొగ్గల డిజిటల్ ప్రింటు... కట్టుకుంటే కొత్త కళే. |
పొడవాటి కాటన్ కుర్తీపై పూపొద మోటిఫ్‌ల డిజిటల్ ప్రింట్లు.. త్రెడ్ ఎంబ్రాయిడరీ... దానికి జతగా షిఫాన్ దుప్పట్టా... వావ్ అనిపించకుండా ఉండదు. |
నగలు, దుస్తులు: www.kalanjali.com |