
తాజా వార్తలు
పరిశుద్ధ జీవనమే... అందమైన వనం!
క్రీస్తువాణి
జీవితం ఒక అందమైన పూలతోట..‘వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమవుతాయ’న్నది క్రీస్తు ఉపదేశం. మన హృదయం వేరులాంటిది. దురాలోచనలు, దుర్మార్గపు చేష్టలకు హృదయమే కేంద్రస్థానం. అందువల్ల మనస్సును కల్మష రహితంగా ఉంచుకోడానికి ప్రయత్నించాలి. దాన్ని పదిలంగా కాపాడుకోవాలి. దీనికి దైవం ఆసరా అవసరం అని ఉద్భోదించారు ప్రభువు. ‘తీగ ద్రాక్ష మొక్కలో నిలిచి ఉంటేనే ఫలిస్తుంది. అలాగే నీవు నాయందు నిలిచి ఉంటేనే సత్ఫలితాలు సాధిస్తారు’ అంటారాయన. ఇక్కడ నాయందు నిలిచి ఉండడం అంటే తాను బోధించిన ప్రేమను, సేవను గుండెల్లో ఉంచుకోవడమని అర్థం. అలాంటి శుద్ధమైన హృదయాలు అద్భుతమైన ఫలాలను అందిస్తాయి. శాంతి, దయ, మంచితనంతో నిండిన జీవితం అందమైన, సువాసనాభరితమైన పూలమొక్కగా ఎదుగుతుందనేది ప్రభువు వాణి.
- ఎం.సుగుణరావు
Tags :
జిల్లా వార్తలు