
తాజా వార్తలు
ఇటీవల చాలా మంది యువత ప్రేమలో విఫలమై... జీవితం ముగిసిపోయిందనే వేదనతో బతుకుతున్నారు. కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టలేకపోతున్నారు. అలాంటి వారు ఈ చిట్కాలు పాటించండి. కొత్త జీవితానికి శ్రీకారం చుట్టండి.
మీ గతప్రేమ తాలూకు గుర్తులేవీ మీ దగ్గర ఉండకూడదనే నిబంధన పెట్టుకోండి. అంటే తీపి గుర్తులుగా దాచుకున్న వస్తువులు, ఫొటోలు, వారి ఫోన్ నెంబర్... అన్నీ మీ దగ్గర నుంచి డిలీట్ చేయండి. అతడిని వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అనుసరించడం మానేయండి. అవతలివారి గురించి తెలుసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఇవి అడ్డుకట్టవేస్తాయి.
* వృత్తిగతంగా లేదా చదువుపరంగా ఏదైనా లక్ష్యం పెట్టుకోండి. దాన్ని సాధించడానికి రోజువారి ప్రణాళిక రూపొందించుకోండి. దాని ప్రకారం మీరు ముందుకు సాగితే ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి, కుంగుబాటు తగ్గుతాయి.
* ఖాళీగా ఉంటే ఆలోచనలు వేధిస్తాయి. అందుకే ఏదైనా కళలో ప్రావీణ్యం సంపాదించడానికి ప్రయత్నించండి. చిత్రకళ, సంగీతం, రాయడం, జిమ్‌కు వెళ్లడం... ఇలా ఏదైనా కానివ్వండి. దానికోసం సమయం కేటాయించుకొని నైపుణ్యాలు పెంచుకోండి. ఇవి మీలో సృజనాత్మకతను పెంపొందిస్తాయి. పాత గాయం నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయి.
* మీలో మీరే సతమతమయ్యే బదులు సామాజిక సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆప్త మిత్రులతో బాధను పంచుకోండి. ఇది మిమ్మల్ని కుదుటపడేలా చేయడమే కాదు... సమస్యను ఎదుర్కోగలమన్న ధైర్యం వస్తుంది.
* పాతజ్ఞాపకాల్ని వదిలేయడానికి కొన్ని రోజులు ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. నూతనోత్తేజం కలుగుతుంది. ఈ సమయంలో ఇన్ని రోజులు మీకు ఏం కోల్పోయామన్న భావన కలిగిందో దాన్ని చేయండి. ఎవరెవరిని కలవలేకపోయారో వారిని కలుసుకునేందుకు ప్రయత్నించండి. వారితో సరదాగా గడపండి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- బంపర్ ఆఫర్ కొట్టేసిన షాలినీ పాండే
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- 2019లో గూగుల్‌లో అధికంగా సెర్చ్ చేసినవివే..
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
