
తాజా వార్తలు
కార్తీకం... పూజలు, వ్రతాలే కాదు పెళ్లిళ్ల మాసం కూడా. పెళ్లనగానే పట్టుచీరల రెపరెపలు... పసిడి నగల ధగధ]గలు... వాటితో మెరిసిపోతున్న పదహారణాల తెలుగమ్మాయిలే గుర్తొస్తారు. ఇప్పుడు అవే కాదు...విభిన్నమైన కేశాలంకరణ, పూల జడలు వైవిధ్యంగా అలరిస్తున్నాయి. వీటిని నవవధువులే కాదు... ఎవరైనా వేసుకోవచ్చు. ఏ సందర్భానికి ఎలాంటివి ఎంచుకోవాలో వివరిస్తున్నారు పెళ్లిపూలజడ.కామ్ నిర్వాహకురాలు కల్పన.
ఇండియన్, ఫ్రెంచ్ స్టైల్స్ కలయికతో ట్రెండీగా పోనీ, ముడి, జడల్ని వేసుకోవడం ఆధునిక శైలి. వేసుకున్న జడకు తగ్గట్లే...ఆర్కిడ్స్, బేబీ బ్రెట్, జెట్సీ, హెడ్రాంజియా, గులాబీ, మల్లెల...వంటి పూలతో ఆధునికంగా జడపూల యాక్సెసరీలు, వేణీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంచుకునే ముందు కేశాలంకరణపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
* ముఖ్యంగా వాలు జడని వేసుకునేటప్పుడు ముందు జుట్టుని స్ట్రెయిటనింగ్ చేయండి. ఆపై ముందు భాగంలో కొంత జుట్టుని తీసుకుని పఫ్లా పెట్టుకోండి. లేదంటే మధ్యపాపిట తీసి రెండువైపులా కొంత జుట్టుని పాయలుగా విడదీసి ఫ్రెంచ్ స్టైల్లో వెనక్కి అల్లేయండి. ఆ పాయల్ని మెలితిప్పి కదలకుండా పిన్నులూ పెట్టొచ్చు. ఇలా ఏదో ఒక స్టైలింగ్ చేశాకే వాలు జడ అల్లండి. ఇవన్నీ సింపుల్గా, స్టైలిష్గా కనిపించేలా చేస్తాయి. ఇలా అల్లిన జడకి పూలబిళ్లలు, మల్లెపూల వల, గులాబీరేకల వేణి...బంగారు సూర్యచంద్రులు, సంపెంగలు...ఇలా వేటితోనైనా అలంకరించుకోవచ్చు. అచ్చంగా బంగారు జడనీ వేలాడదీయొచ్చు. తలంబ్రాలు, తాళికట్టేవేళ నవవధువుకి ఇది అదనపు అందాన్ని తెచ్చిపెడుతుంది. పరికిణీ-ఓణీలకు ఇదో చక్కటి కాంబినేషన్.
* ఆధునికంగా కనిపించాలనుకుంటే... పూర్తిగా వదిలేయడమో, పోనీ వేయడమో చేయకుండా ఇలా ప్రయత్నించొచ్చు. జుట్టుని రెండువైపులా చెవి వెనకనుంచి మూడు పాయల్ని తీసుకోవాలి. వాటిని అల్లుకుంటూ మరోవైపునకు తెచ్చి కదలకుండా పిన్నులు పెట్టాలి. ఇలా రెండు మూడు వరుసల్లో చేయాలి. మిగిలిన జుట్టుని వదిలేయాలి. దీన్ని వేవీవేవీగా రోల్ చేస్తే...బాగుంటుంది. అల్లిన జడపై పూల క్లిప్పుని, లేదా గుత్తుల్ని పెడితే ట్రెండీలుక్ని తెచ్చిపెడతాయి. ఈ తరహా స్టైల్స్ మెహెందీ, సంగీత్ వంటి వేడుకలకు బాగుంటాయి. జుట్టు కాస్త పొడవుంటే దాన్ని సమాన విరామంతో విభజించుకుని రబ్బరు బ్యాండు పెట్టుకుని స్టైలింగ్ చేసుకోవచ్చు. లేదా ఫిష్టెయిల్ తరహాలో అల్లుకుని పూలను అలంకరించుకోవచ్చు. ఇవి వ్రతం, పెళ్లికూతురు వేడుక, రిసెప్షన్ వంటివాటికి బాగుంటాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
- పసిపాప రియాక్షన్కు నెటిజన్లు ఫిదా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
