
తాజా వార్తలు
పెళ్లయిన కొత్తల్లో ఎంతో హాయిగా గడిచిపోతుంది జీవితం. ఏళ్లు గడిచే కొద్దీ ఇద్దరూ కలిసే బతుకుతున్నా ఏదో నిస్సారం కనిపిస్తుంది కొన్ని జంటల్లో. మనం కోరుకున్నంత ప్రేమ అందడం లేదని, తీరిక దొరకడంలేదని రకరకాల కారణాలు మొదలవుతాయి. వాటికి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది గనుక బంధాన్ని సజీవంగా మార్చుకునేలా చూసుకోండి.
* ఎంతగా ప్రేమించేవాళ్లైనా... మన మనసుని ఇట్టే అర్థం చేసుకుంటారనేం లేదు. మనం అనుకున్నవన్నీ ఎదుటివారికి తెలిసిపోతాయనీ లేదు. అయినా సరే... భాగస్వామిపై అంచనాలు పెంచుకుని మన మనసు తెలుసుకోవాలని కోరుకుంటాం. అప్పుడే అలకలు, కోపాలు పెరిగిపోతాయి. ఆ సమస్య బారిన మీరు పడకూడదంటే... మనసు విప్పి మాట్లాడండి. ఎదుటివ్యక్తి నుంచి మీరేం ఆశిస్తున్నారో చెప్పండి. అది మీ మధ్య బంధాన్ని బలపరుస్తుంది.
* ఇతరుల సమస్యల్ని అర్థం చేసుకోవడంలో మగవారితో పోల్చి చూసినప్పుడు మహిళలు ఒక అడుగు ముందే ఉంటారు. కానీ తమ కష్టాన్ని భాగస్వామి గుర్తించలేదని బాధపడిపోతుంటారు. మనసులో కుంగిపోవడం కన్నా... ఎదుటివారికి ఆ కష్టం తెలిసేలా చేయాలి. మీ పనుల్లో కొన్ని భాగస్వామికి పంచండి. అప్పుడే మీ సమస్యలకి ఓ పరిష్కారం లభిస్తుంది. మీపై ఒత్తిడీ తగ్గుతుంది. అభద్రతా దూరం అవుతుంది.
* ఎంత తీరిక లేకపోయినా సరే... ఒకరి కోసం మరొకరు కచ్చితంగా సమయం కేటాయించుకోవాలి. ఆ ఏకాంత సమయమే దాంపత్యంలో ఆహ్లాదాన్ని తగ్గిపోకుండా చేస్తుంది. ఈ విషయంలోనూ మీ ఇష్టాయిష్టాలని అవతలివారితో పంచుకుని చూడండి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
