
తాజా వార్తలు
చలికాలంలో గాల్లో తేమ ఎక్కువ ఉండటంతో కాలుష్యం సమస్యా పెరుగుతుంది. దీన్నుంచి బయటపడాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుని చూడండి.
* బొప్పాయికి కాలుష్యం కారణంగా ఎదురయ్యే సమస్యలను నిరోధించే గుణం ఉంటుంది. అందుకే దీన్ని సూపర్‌ఫుడ్ అని అంటారు. వీటిని తరచూ ఆహారంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
* కాఫీలను తగ్గించాలి. ప్రత్యామ్నాయంగా గ్రీన్‌టీ, అల్లంటీ వంటివి తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు, చక్కెరలు అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పూర్తిగా మానేయాలి.
* సాధారణంగా చలికాలంలో జీర్ణక్రియ పనితీరు మందగిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మసాలాలు లేని, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను ఎంచుకుంటే మంచిది. వేపుళ్లను వీలైనంతవరకూ తగ్గించాలి.
* టొమాటోలో ఉండే లైకోపిన్ శ్వాస సంబంధ సమస్యలను నివారిస్తుంది. దీన్ని చలికాలంలో ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
* విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరి, జామ పండ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. బాదం, జీడిపప్పు, డ్రైఫ్రూట్స్‌లో మెగ్నిషియం సమృద్ధిగా లభిస్తుంది. కాలుష్యంతో వచ్చే శ్వాసనాళాల ఇన్ఫెక్షన్లను అడ్డుకునే శక్తి వీటికి ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
* మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. చికెన్, మటన్‌కు ప్రత్యామ్నాయంగా ఒమేగాత్రీ ఫ్యాటీ యాసిడ్లు అందే చేపలు, గుడ్డు వంటివి ఎంచుకోవాలి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
