close

తాజా వార్తలు

త్రీపిన్‌ ప్లగ్‌లో ఒకటి వేరుగా ఉంటుందేం?

ప్రశ్న: త్రీపిన్‌ ప్లగ్‌లోని మూడు పిన్నుల్లో ఒకటి పొడవుగా, లావుగా ఉంటుంది. ఎందువల్ల?
- తాడి విజ్ఞేశ్వరి, 10వ తరగతి, జడ్‌పీహెచ్‌ఎస్‌, మామిడికుదురు
విద్యుత్‌ వల్ల మనకు ఎంత మేలు జరుగుతుందో తేడా వస్తే అంతే ప్రమాదాలూ వస్తాయి. ఇలాంటివి ఎదురుకాకుండా రక్షణ అవసరం.
* మనం వాడుకునే విద్యుత్‌ పరికరాలు లోహపు భాగాలతో నిర్మితమై ఉంటాయి. వీటిని సరైన పద్ధతిలో ఎర్త్‌ చేయకపోతే విద్యుత్‌ వీటిలో ప్రవహించి వాటిని ఉపయోగిస్తున్న వ్యక్తికి ఎలక్ట్రిక్‌ షాక్‌ తగులుతుంది.
* ఇటువంటి ప్రమాదాల నివారణ కోసం త్రీపిన్‌ ప్లగ్‌ను ఉపయోగిస్తారు. మూడు పిన్నులు ఉండే విద్యుత్‌ ప్లగ్‌ను త్రీపిన్‌ ప్లగ్‌ అంటారు.
* ఈ మూడు పిన్నుల్లో ఒకటిలైవ్‌ తీగకు, రెండోది న్యూట్రల్‌కు, మూడోది పొడుగ్గా లావుగా ఉండేది ఎర్త్‌కు కలిపి ఉంటుంది.
* పరికరంలో ఏదైనా కరెంట్‌ లీకేజ్‌ ఉంటే మనిషికి షాక్‌ తగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎర్త్‌ పిన్‌ అటువంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది.
* ఈ ప్లగ్‌ను సాకెట్లో ఉంచగానే లావుగా, పొడుగ్గా ఉన్న పిన్ను ముందుగా సాకెట్లోకి వెళుతుంది. ఏమాత్రం కరెంట్‌ లీకేజ్‌ ఉన్నా వెంటనే ఈ పిన్ను ఎర్త్‌కు పంపేస్తుంది. మిగిలిన రెండు పిన్నులు సాకెట్లో సర్దుకునే కాలవ్యవధి లోపు ఈ ఎర్త్‌పిన్‌ ప్రమాదం లేకుండా లీకేజ్‌ కరెంట్‌ను ఎర్త్‌ చేస్తుంది. లావుగా ఉండటం వల్ల దీనికి నిరోధం చాలా తక్కువగా ఉండి విద్యుత్‌ సులువుగా ఎర్త్‌ అవుతుంది.

- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ,  ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.