
తాజా వార్తలు
హ్హ..హ్హ..హ్హ!
టీచర్: డుంబూ! రెండు రోజులుగా చూస్తున్నాను. గంట కొట్టగానే అందరికంటే ముందు బయటకు పరుగు పెడుతున్నావు. ఎందుకు అంత తొందర?
డుంబు: ‘ఆలస్యం అమృతం విషం’ అని మా బామ్మ చెప్పింది టీచర్.
టీచర్: అవునా? మరి స్కూలుకు వచ్చేటప్పుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నావ్?
డుంబు: ‘నిదానమే ప్రధానం’ అని కూడా మా బామ్మ చెప్పింది టీచర్!
- జె.వి.వరప్రసాదరావు, నెల్లూరు
Tags :
జిల్లా వార్తలు