close

తాజా వార్తలు

మలుపుల్లో మర్మమేంటి?

ప్రశ్న:  రోడ్డు మలుపులో వాహనాలు పడిపోకుండా ఎలా ప్రయాణిస్తాయి?
సరళరేఖ మాదిరిగా సమాంతరంగా ఉన్న దారిపై వాహనాలు ఎంత వేగంగా వెళ్లినా.. వాటి మీద పార్శ్వదిశల్లో (కుడి, ఎడమ వైపు) ఏ బలాలూ పనిచేయవు. కానీ, మలుపుల్లో ఏదైనా వస్తువు (వాహనం) వెళ్లేటప్పుడు దాని మీద ప్రకృతి సిద్ధంగా అపకేంద్రబలం (
Centrifugal forcez) పని చేస్తుంది. వక్రతల (Curves) మార్గంలో ఎడమవైపు నుంచి కుడివైపునకు (సవ్యదిశ) తిరుగుతుంటే ఎడమవైపునకు, కుడి నుంచి ఎడమకు (అపసవ్య దిశ) తిరుగుతుంటే కుడివైపునకు ఈ అపకేంద్ర బలం పని చేయడం వల్ల వాహనం పడిపోవచ్చు. ఈ ప్రమాద శాతం.. వాహన వేగపు వర్గానికి అనులోమానుపాతం (In proportion to the) లో, వక్ర మార్గపు వ్యాసార్థానికి విలోమానుపాతం(Inversely)లో ఉంటుంది. వాహనం బరువు ఎంత ఎక్కువగా ఉంటే.. ఈ అపకేంద్రబలం అంత ఎక్కువ అవుతుంది. ఫలితంగా వాహనం పడిపోతుంది. అందుకే ఈ వక్రమార్గాల్లో రోడ్డు సమతలంగా కాకుండా.. కుడివైపు వంపు మార్గాల్లో ఎడమ భాగం, ఎడమవైపు వంపు మార్గాల్లో కుడి భాగం ఎత్తుగా ఉండేలా నిర్మిస్తారు. దీనివల్ల అపకేంద్ర బలాన్ని తటస్థం (Neutral) చేసే బలాలు ఏర్పడి.. వాహనం పడిపోకుండా ముందుకు సాగుతుంది.

- ప్రొ।। ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; ఎడిటర్‌, చెకుముకి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)

 

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.