Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 46483
            [news_title_telugu_html] => 

ఈ బొకేలను భోంచేయొచ్చు

[news_title_telugu] => ఈ బొకేలను భోంచేయొచ్చు [news_title_english] => [news_short_description] => సాధారణంగా బొకేలు దేంతో తయారు చేస్తారు..? పూలతో... కానీ ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలతో తయారు చేస్తారు... ఆశ్చర్యపోకండి... ఇంకా ఉంది... మనం బొకేలు ఎవరికైనా ఇస్తే వాళ్లేం చేస్తారు... కొద్దిసేపు తమతో ఉంచుకుని తర్వాత వాటిని ఎక్కడైనా పడేస్తారు... కానీ ఈ బొకేలోని కూరగాయలతో చక్కగా వండుకోవచ్చు. విందు చేసుకోవచ్చు... ఎందుకంటే ఇవన్నీ సేంద్రియ విధానంలో పండించిన కూరగాయలు కాబట్టి... [news_tags_keywords] => bouquet, flowers, vegetables, tirupati, varevva, special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-01-21 01:22:16 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఈ బొకేలను భోంచేయొచ్చు - EENADU
close

తాజా వార్తలు

ఈ బొకేలను భోంచేయొచ్చు

ఈ బొకేలను భోంచేయొచ్చు

‘‘వినూత్నమైన ఆలోచన నుంచి విభిన్నమైన ఆవిష్కరణ సాధ్యమవుతుంది’’
- ఏపీజే అబ్దుల్‌ కలాం, భారత మాజీ రాష్ట్రపతి

సాధారణంగా బొకేలు దేంతో తయారు చేస్తారు..? పూలతో... కానీ ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలతో తయారు చేస్తారు... ఆశ్చర్యపోకండి... ఇంకా ఉంది... మనం బొకేలు ఎవరికైనా ఇస్తే వాళ్లేం చేస్తారు... కొద్దిసేపు తమతో ఉంచుకుని తర్వాత వాటిని ఎక్కడైనా పడేస్తారు... కానీ ఈ బొకేలోని కూరగాయలతో చక్కగా వండుకోవచ్చు. విందు చేసుకోవచ్చు... ఎందుకంటే ఇవన్నీ సేంద్రియ విధానంలో పండించిన కూరగాయలు కాబట్టి...

తిరుపతి పద్మావతిపురానికి చెందిన సాయికుమార్‌ నగరంలో పూలబొకేల దుకాణం నిర్వహించుకునేవారు... చిన్నగా మొదలైన వ్యాపారాన్ని తన పరిచయాలతో పెంచుకున్నారు... ఇంతలోనే తిరుపతిలో ప్లాస్టిక్‌ నిషేధం అమల్లోకి తెచ్చారు. దీంతో వ్యాపారం నిర్వహించుకునేందుకు సాయికుమార్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. అనుకోకుండా వచ్చిన కష్టానికి పరిష్కారం ఆలోచిస్తూ... ఇంటికి వెళుతుండగా దారిలో పూలన్నీ కుప్పలు తెప్పలుగా రోడ్డుపై పడిపోయి ఉండటం గమనించాడు. ఎంతో అపురూపంగా... శ్రమతో తయారు చేస్తున్న పూలబొకేలు ఇదే రీతిలో పడేస్తున్నారా..? వాటిని దాచుకుంటున్నారా...? దాచుకుంటే ఆ వాడిన పూలను ఎన్నిరోజులు ఇంట్లో ఉంచుకుంటారు..? అన్న ఆలోచనలు అతని కొత్త ఆవిష్కరణకు కారణమయ్యాయి.

ఈ బొకేలను భోంచేయొచ్చు

* సాయికుమార్‌ కుటుంబసభ్యులు మార్కెట్లో కాయగూరలు కొనరు. తమ పెరట్లో సేంద్రియ పద్ధతిలో పెంచుకునే కూరగాయలతోనే వారి ఆహారం తయారవుతుంది. సాయికుమార్‌కు కూడా సేంద్రియ వ్యవసాయం అంటే విపరీతమైన అభిమానం.  సేంద్రియ పద్ధతిలో పెంచిన తాజా కూరగాయాలనే బొకేలుగా మార్చితే... వాటినే బహుమతిగా ఇస్తే... అందుకునేవారు వాటిని తాజాగా కూర చేసుకొని తింటే... ఆరోగ్యానికి ఆరోగ్యం... బహుమతికి అర్థం ఉంటుందని భావించాడు. మొదట ఒక బొకేను తయారు చేసి దుకాణంలో ఉంచారు. రెడ్‌ క్యాప్సికం, గ్రీన్‌ క్యాప్సికం, దోసకాయ, ఆనపకాయ, వంకాయ, బెండకాయ, క్యాబేజీ, క్యారెట్‌ ఇలా కూరగాయలను చూడచక్కగా వరుసలో పేర్చి... కాగితంతో తయారు చేసిన అందమైన బుట్టలో ఉంచిన  ఈ బొకేను చూసిన చాలామంది నుంచి వారెవ్వా అన్నారు. మొదటి రోజు 2 బొకేలు అమ్ముడుపోయాయి. బహుమతిగా కూరగాయాల బొకే ఇచ్చిన వారు... వాటిని స్వీకరించిన వారు మురిసిపోయారు. అతి తక్కువ సమయంలోనే తిరుపతిలో చాలామంది ఈ కొత్తరకం కూరగాయల బహుమతికి ఫిదా అయ్యారు. జనవరి 1న సాయికుమార్‌ సుమారుగా 50 వరకు బొకేలు అమ్మారు.

ఈ బొకేలను భోంచేయొచ్చు

* గతంలో బొకెల కోసం పూలను ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించేవారు. దీంతోపాటు పలమనేరు, కుప్పం, బి.కొత్తకోటతోపాటు.. విదేశాల నుంచి పుష్పాలు వచ్చేవి. వీటి ఖరీదు ఎక్కువగా ఉండేది. అయితే సాయికుమార్‌ విన్నూతమైన ఆలోచనతో ప్రస్తుతం అతడి విరుల ఖర్చు తగ్గింది. అయితే తాజా కూరగాయలు మాత్రం తన  ఇంటి పెరట్లోవే వాడుతున్నాడు.అయితే రాన్రాను వస్తున్న ఆర్డర్లతో ప్రస్తుతం తాను పండించే కూరగాయాలు సరిపోని పరిస్థితి వచ్చింది. దీంతో సేంద్రీయ సాగుతో కూరగాయాల పంటలు పండించే వారి ద్వారా కూరగాయలు కొనుగోలు చేయాలని చూస్తున్నాడు... తన విభిన్నమైన ఆలోచనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు... స్పందన ఆశ్చర్యానికి గురిచేస్తోందని సాయికుమార్‌ చెబుతున్నాడు.

- చిత్ర కథనం: సింహాచలం, తిరుపతి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.