Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 48104
            [news_title_telugu_html] => 

చల్లని కొండపై.. మెత్తటి స్వామి

[news_title_telugu] => చల్లని కొండపై.. మెత్తటి స్వామి [news_title_english] => [news_short_description] => తెలుగు రాష్ట్రాల్లో నరసింహస్వామి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో సింహభాగం దట్టమైన అడవుల్లో, కొండల్లో ఉన్నవే! [news_tags_keywords] => Hemachala lakshmi Narasimha swami, malluri, devotional, temple, jayashankar bhupalpally, forest, vihari, special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-01-25 00:52:44 [news_isactive] => 1 [news_status] => 2 ) )
చల్లని కొండపై.. మెత్తటి స్వామి - EENADU
close

తాజా వార్తలు

చల్లని కొండపై.. మెత్తటి స్వామి

తెలుగు రాష్ట్రాల్లో నరసింహస్వామి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో సింహభాగం దట్టమైన అడవుల్లో, కొండల్లో ఉన్నవే! అలా వెలిసిందే హేమాచల నరసింహ క్షేత్రం. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలం మల్లూరులో పచ్చని అడవిలో కొండపై వెలిసిన హేమాచల నృసింహుడి దర్శనం ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచడంతో పాటు అడవితల్లిని పరిచయం చేస్తుంది.

ఒకవైపు పక్షుల కిలకిలలు.. మరోవైపు వనదేవత పచ్చదనంతో నిండుగా దర్శనమిస్తుంది హేమాచలం. మల్లూరు నుంచి చెట్ల నీడలో మూడు కిలోమీటర్లు నడిచి హేమాద్రికి చేరుకుంటారు. వాతావరణంలో చల్లదనం.. పరిసరాల్లో కొత్తదనం.. మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. ఆ ఆనందంలో నుంచి తేరుకోకముందే నరసింహస్వామి దర్శనంతో దివ్యానుభూతి కలుగుతుంది. ఆలయానికి ఎడమ వైపున ఒక చిన్న జలధార ఉంటుంది. దీనిని చింతామణి జలపాతం అంటారు. ఏ కాలంలో అయినా నీటిధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ప్రశ్నార్థకం.


గుట్టలు గుట్టలుగా ఆనవాళ్లు
వనదేవత ఒడిలో ఉన్న మల్లూరు గుట్టపై చారిత్రక ఆనవాళ్లు ఎన్నో కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో సుమారు 20 కిలోమీటర్ల పొడవున వేలాది ఎకరాల్లో గుట్టలు విస్తరించి ఉన్నాయి. వీటిని గడెలగుట్ట, సంగంపల్లి మొకిరెగుట్ట, గుడ్డేలుగాల గుట్ట, నరసింహస్వామి బాడువల గుట్ట, మల్లూరు గుట్టగా పిలుస్తుంటారు. వీటన్నింటినీ మల్లూరు గుట్టలుగానే పరిగణిస్తారు. ఈ గుట్టల్లోనే నాలుగు కోటలు ఉన్నాయి. శాతావహనుల కాలం నాటి కోట, రుద్రమదేవి, ప్రతాపరుద్రుని కోటలు, నిజాం రాజుల కోటలు ఉన్నాయి. గుట్టపై నాలుగు దిక్కులా పది అడుగుల ఎత్తులో భారీ కుడ్యం (గోడ) కనిపిస్తుంది. గుట్టల్లో ధాన్యాగారం, రాక్షస గుహలు, చెరువులు, కుంటలు, సొరంగాలు ఇలా ఎన్నో ఔరా అనిపిస్తాయి. నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన యాత్రికులు తిరుగు ప్రయాణంలో మంగపేట మండలం రమణక్కపేట చేరుకుంటారు. అక్కడి నుంచి స్థానిక గిరిజనుల సహకారంతో గుట్టలపై ఉన్న కోటలను, గుహలను చూసి వస్తుంటారు.

సమీపంలో
లక్నవరం సరస్సు (60 కి.మీ.)
బొగత జలపాతం (35 కి.మీ.)
మేడారం (55 కి.మీ.)


చేరుకునేదిలా..
వరంగల్‌ నుంచి మల్లూరు సుమారు 130 కి.మీ. దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి మంగపేటకు బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి మల్లూరుకు బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో (8 కి.మీ.) చేరుకోవచ్చు. కొండపైకి ప్రైవేట్‌ వాహనాలు వెళ్తాయి. మంగపేట, ఏటూరునాగారంలో బస సౌకర్యం ఉంది.


మనిషి దేహంలా..
హేమాచల నృసింహుని విగ్రహం రాతితో మలిచిందే అయినా.. నాభి ప్రదేశం మనిషి దేహంలా మెత్తగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. నాభి దగ్గర ఎప్పుడూ ఒక ద్రవం ఊరుతూ ఉంటుంది. ఆ ద్రవాన్ని నాభి చందనంగా పిలుస్తారు. దానినే ప్రసాదంగా స్వీకరించడం ఇక్కడి ప్రత్యేకత.

- అక్కెనపల్లి వెంకటేశ్వర్లు, మంగపేట


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.