Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 83715
            [news_title_telugu_html] => 

ప్రకృతితో సావాసం అరణ్యవాసం!

[news_title_telugu] => ప్రకృతితో సావాసం అరణ్యవాసం! [news_title_english] => [news_short_description] => జలం నుంచి జీవం వరకు అన్నీ మనిషికి ఇస్తుంది ప్రకృతి... కానీ దాన్ని ఎలా వినియోగించుకుంటున్నారన్నదే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది... నిజానికి ప్రకృతి నుంచి మనిషి తీసుకోవట్లేదు... దోచుకుంటున్నాడు. ఇది అన్యాయం... [news_tags_keywords] => Nature, Forest, Living, Arunya, special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-15 00:12:12 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్రకృతితో సావాసం అరణ్యవాసం! - EENADU
close

తాజా వార్తలు

ప్రకృతితో సావాసం అరణ్యవాసం!

జలం నుంచి జీవం వరకు అన్నీ మనిషికి ఇస్తుంది ప్రకృతి... కానీ దాన్ని ఎలా వినియోగించుకుంటున్నారన్నదే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది... నిజానికి ప్రకృతి నుంచి మనిషి తీసుకోవట్లేదు... దోచుకుంటున్నాడు. ఇది అన్యాయం... చెప్పాలంటే అనైతిక ప్రవృత్తి. దానికి అత్యవసరంగా అడ్డుకట్ట వేయాలంటుంది అరణ్య. దీనికోసం అన్నీ తెలుసుకోమంటుంది... ప్రకృతి గుండె చప్పుడు వినమంటుంది... ఎలా వినాలో మేం నేర్పిస్తాం రమ్మంటుంది...

హీరాబాద్‌లోని దిగ్వేల్‌ రిజర్వ్‌ఫారెస్ట్‌ని ఆనుకుని ఉంటుంది పదెకరాల్లో విస్తరించిన అరణ్య అగ్రికల్చర్‌ ఆల్టర్నేటివ్స్‌ సంస్థ. ఇక్కడే పెర్మాకల్చర్‌కి సంబంధించిన పాఠాలు చెబుతారు  నర్సన్న కొప్పుల, పద్మ దంపతులు. పాఠాలు చెబుతారంటే మన బడి మాదిరిగా తరగతి గదులు, టీచర్లు, నోట్‌పుస్తకాలు ఇతరత్రా హంగామా ఉంటాయని అనుకుంటే తప్పులో కాలేసినట్టే! అవేమీ ఉండవు. ఇది ప్రకృతి ఒడి. రసాయనాలకు, ప్లాస్టిక్‌కి దూరంగా   ఉండే ఆ నేలపై..  అంతటా పచ్చగా పరుచుకున్న వివిధ రకాల వృక్షాలు, స్వేచ్ఛగా అల్లుకున్న పొదలూ, తృణధాన్యాల పంటలూ, నేలసారాన్ని పెంచే నేస్తాలూ ఉంటాయి. మండే ఎండల్లో కూడా నిండుగా నీళ్లతో కనిపించే బావులు... గేదెలు, మేకలు, గాడిదలు కూడా కనిపిస్తాయి. పెర్మాకల్చర్‌తో ఒనగూరే లాభాలు వివరించడానికి ‘అరణ్య’ ఓ నమూనా!

శాశ్వత సాగు....
పర్మనెంట్‌, అగ్రికల్చర్‌ పదాల నుంచి వచ్చిన మాటే పర్మాకల్చర్‌. దీన్నే శాశ్వత సాగు విధానం అంటున్నారు. అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రకృతితో చెలిమి చేస్తూ చేసే వ్యవసాయ విధానం. పాడిపంటలు అని పేరుకే అంటున్నాం కానీ ఇప్పటి రైతులు చాలామంది పాడికి దూరమయ్యారు. విత్తనాల కోసం, మందుల కోసం వేరొకరిపై ఆధారపడుతున్నారు. ప్రకృతి వైవిధ్యం కోల్పోవడానికి కారణమవుతున్నారు. నష్టాల్లో కూరుకుపోతున్నారు. దీనికి వ్యతిరేకంగా మొదలైన ఉద్యమమే పెర్మాకల్చర్‌. 1970లలో ఆస్ట్రేలియాకు చెందిన బయో సైన్స్‌ ప్రొఫెసర్లు బిల్‌మాలిసన్‌, డేవిడ్‌ హాలోగ్రామ్‌లు తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రపంచం మొత్తం తిరిగి వివిధ ప్రాంతాల్లోని ప్రకృతి వ్యవసాయాలను గమనిస్తూ పర్మాకల్చర్‌ విధానానికి శ్రీకారం చుట్టారు. తమ అనుభవాలను పెర్మాకల్చర్‌  డిజైనర్స్‌ మాన్యువల్‌ పేరుతో పుస్తకంగా రాశారు. మనం బతుకుతూ ప్రకృతిలోని వివిధ జీవరాశులని కూడా బతికించుకోవాలి. అలా జరగాలంటే పంటల్లో వైవిధ్యం చూపించాలి అనేది పర్మాకల్చర్‌ ప్రాథమికసూత్రం. అప్పటికే ఏకపంట విధానాన్ని అనుసరిస్తున్న మన రైతులు చాలామంది పర్మాకల్చర్‌ని అనుసరించడానికి వెనుకాడారు. వ్యవసాయ రంగంలో చక్కని అనుభవం ఉండి, ప్రయోగాల దిశగా అడుగులు వేస్తున్న నర్సన్న 1989లో ఆస్ట్రేలియా వెళ్లి పర్మాకల్చర్‌ని అభ్యసించారు. దాన్ని పదిమందికీ తెలియజెప్పి, అందరినీ ఆ విధానంవైపు మళ్లించాలన్నది ఆయన లక్ష్యం. అయితే ఆ విధానాలని ఇక్కడ అమలు చేయడం అంత సులభం కాలేదాయనకి. ఎవరికో చెప్పేముందు మనమే ఎందుకు చేయకూడదు అని జహీరాబాద్‌లోని బిడకన్నె ప్రాంతంలో 1999లో పదెకరాల బీడు భూమిని ఎన్నుకుని పర్మా విధానంలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. అదే ప్రస్తుతం సేంద్రియ ‘అరణ్య’గా మారింది. ఆ అనుభవాలే కొన్ని వేల మందికి పాఠాలయ్యాయి.

పెర్మాకల్చర్‌ కోసం మూడు నైతిక విలువలను పాటించాలని అరణ్య చెబుతుంది.

1. భూసంరక్షణ 2. ప్రజల సంరక్షణ 3. న్యాయమైన వాటా
* భూమిపై ఉన్న ప్రతి కణం, ప్రతి జీవి కూడా ఒక క్రమ పద్ధతిలో తన జీవితాన్ని గడుపుతుంటుంది. ఆ క్రమాన్ని  ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకపరచకూడదు. అలా చేయడం వల్ల మనిషి జీవితం కూడా సాఫీగా సాగుతుంది. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుందని చెబుతుంది వేదం. ప్రకృతిని సంరక్షిస్తే మనిషిని అదే రక్షిస్తుందని చెబుతుంది అరణ్య.
* ప్రతి జీవికీ ప్రకృతిలో దాని వాటాను అది తీసుకుని జీవించే హక్కు ఉంటుంది. కానీ మనిషి ఇతర జీవుల వాటానూ లాగేసుకుంటున్నాడు. ఈ క్రమంలో వాటిని చంపేస్తున్నాడు. ఇది అనైతికం అంటుంది అరణ్య. దీనివల్ల చివరకు మనుగడ కోల్పోయేది మనిషేనన్నది గుర్తించమంటుంది.

ఆ 5 సూత్రాలు

ప్రకృతిని గమనించు. అది మనకు అనేక శక్తులని ఇస్తుంది. వాటిని ఒడిసిపట్టు
తక్కువ పనితో ఎక్కువ ఫలితాలు . ఒక మొక్కకు నీరు పోస్తుంటే దాని వల్ల ఇతర జీవావరణ వ్యవస్థలకూ నీరు పోసినట్టే... దీన్ని గుర్తించు
వృథాను కానివ్వద్దు. ఏది ఎంత అవసరమో అంతే తీసుకోవడం వల్ల వనరులను కాపాడినట్లవుతుందని తెలుసుకో.
వైవిధ్యమే రక్షణనిస్తుంది. పంట నుంచి ప్రతి వినియోగం వరకు సృజనాత్మకతను ప్రదర్శించు
ముందు నువ్వు ఆచరించు. తర్వాత నీ కుటుంబాన్ని ప్రోత్సహించు. ఆ తర్వాత సమాజానికి తెలియపరుచు

అన్ని రకాల భద్రతలూ..
అ·రెకరం భూమి ఉన్నా చాలు మనకి కావాల్సిన కాయగూరలు, ధాన్యాలు, పప్పులు, పాడిని పొందొచ్చు. ఆహారభద్రత, ఇంధన భద్రతని పొందవచ్చని అంటారు నర్సన్న దంపతులు.మా భూమిని కూడా సేంద్రియమయం చేసుకుంటూ పర్మాకల్చర్‌ విధానంలోకి మార్చుకుంటాం అంటే అందుకు తగిన సాయం కూడా చేస్తారు. ఇందుకోసం అరణ్యలో పదమూడు రోజుల పెర్మా కోర్సుకి హాజరు కావాల్సి ఉంటుంది. చివరిగా తాము నేర్చుకున్న విషయాలని సొంతభూముల్లోకానీ, ఇతరుల భూముల్లో కానీ అమలు చేసి ప్రాజెక్టువర్క్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. వర్షం నీరు వృథాగా పోకుండా కాంటూర్‌ బండింగ్‌ నేర్పిస్తారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా నేలని సారవంతం చేసుకోవడం, విత్తనాలని దాచిపెట్టుకోవడం, నీటివనరులు సమకూర్చుకోవడం, నర్సరీల నిర్వహణ, పాడిని సమకూర్చుకోవడం వంటివన్నీ ఇక్కడ నేర్పిస్తారు. ఇక్కడ పాఠాలు నేర్చుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు వస్తుంటారు. ప్రతి రోజు వాళ్లందరికీ కావాల్సిన ధాన్యాలు, పండ్లు, పాలు, పెరుగు సహా ఇక్కడ నుంచే సమకూర్చుకుంటారు నర్సన్న దంపతులు.

- గొర్లె శ్రీసత్యవాణి, ఈనాడు, హైదరాబాద్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.