
తాజా వార్తలు
ఇల్లు మారితే సమాజం మారుతుంది... ఇంటిని మార్చగలిగేది మాత్రం ఆ ఇంట్లోని పిల్లలే అని బలంగా నమ్మారా ఉపాధ్యాయురాలు... ఆ పిల్లల భావి జీవితం భద్రంగా ఉండాలంటే పురాణాలు, శతకాల్లోని పద్యాలను సమస్యలు, పరిష్కార కోణంలో నుంచి నేర్చుకునేలా చేస్తే... ఈ ఆలోచనే ఆమెను ప్రత్యేకంగా నిలిపింది. ఇప్పుడు తన బడిలోని చిన్నారులను నీతిశతకాల్లో నిష్ణాతులను చేస్తూ వారిని నైతిక విలువలున్న పౌరులుగా మార్చుతున్నారామె...
రాచర్ల మండలం చోళ్లవీడు... ప్రకాశం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం... అక్కడో పాఠశాల... అందులో అచ్చనాల రమాదేవి ఓ సాధారణ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయిని... వచ్చామా, పాఠాలు చెప్పామా, వెళ్లామా... వందకు తొంభై మంది ఇలాగే ఆలోచిస్తారు. కానీ ఆమె అలా కాదు...
‘‘2017లో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభల్లో పద్యాలను ఒక అంశంగా తీసుకొని ఒక బాలిక వేమన శతకంలోని 50 పద్యాల వరకు చెప్పగలిగింది. ఆ బాలికను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలోని చెడును నిలువరించే పద్యాలు ఎంచుకొని విద్యార్థులకు నేర్పించినట్లు రమాదేవి చెబుతారు.’’ |
ఇలా చేస్తారు... * పాఠశాల సమయం అనంతరం రోజూ ఒక పద్యాన్ని చొప్పున నేర్పిస్తారు. ముందు పద్యం బోర్డుపై రాసి తాను రాగయుక్తంగా చదివి వినిపిస్తారు. అనంతరం తనతో పాటు పలికిస్తారు. అంశం పూర్తయిన తర్వాత పద్యాలు రాసిన చార్టులు గోడలపై ప్రదర్శించే వారు.* రోజూ ప్రార్థనా సమయంలో విద్యార్థులు పద్యాలు చెప్పేందుకు పోటీలు పడే వారు. . * అందరికీ తెలియడానికి వీలుగా విద్యార్ధులు రెండు సంవత్సరాలుగా గ్రామంలో జరిగే వేడుకల్లో, తల్లిదండ్రుల సమావేశాల్లో ఈ శతకాలను వినిపిస్తున్నారు. * పద్యాలు కాకుండా పిల్లలు నీతికథల్లోనూ నిష్ణాతులవుతున్నారు. |
తన పరిధిలో పిల్లలను నైతికంగా బలవంతులను చేయాలన్నది ఆమె ఉద్యోగంలో చేరిన తొట్టతొలి రోజు పెట్టుకున్న లక్ష్యం. అంతకు ముందు కర్నూలు జిల్లాలో పనిచేసిన ఆమె అంతర్జిల్లా బదిలీల్లో చోళ్లవీడు పాఠశాలకు వచ్చినప్పటి నుంచి తన వినూత్నమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.
ఈమె ఆదే గ్రామంలో నివాసం ఉంటూ విద్యార్ధుల కుటుంబాల్లో అనేక సమస్యలను గుర్తించారు. అసలు నైతిక విలువల జననమైనా, హననమైనా ప్రారంభమయ్యేది ఇంట్లోనే కాబట్టి అక్కడ మార్పు రావాలని ఆమె విశ్వసించారు. దానికోసం పిల్లలను ఆయుధాలుగా చేసుకున్నారు. ముందుగా వారి కుటుంబాల్లో తలెత్తే సమస్యలు ఆమె పరిశీలించారు. వాటికి పరిష్కారం చూపే పద్యాలను, నీతి కథలను ఎంపిక చేసుకున్నారు. ఇలా వేమన శతకం, సుమతీ శతకం, తెలుగు బాల శతకం, భరత బాలశతకం, తెలుగు బిడ్డ శతకం, కుమారీ శతకాల నుంచి మొత్తం 108 పద్యాలు ఎంచుకున్నారు. మొదట 2016-17లో 4, 5 తరగతుల విద్యార్ధులు 18 మందిని ఎంపిక చేసుకుని వారికి 42 పద్యాలు నేర్పించారు. ఇప్పుడు మొత్తం 62 మంది విద్యార్థులను 108 నీతి పద్యాల్లో నిష్ణాతులను చేశారు.ఈ విద్యార్థులు భాష, ఉచ్ఛరణ దోషాలు లేకుండా ఏ పద్యం ఎక్కడ అడిగినా భావంతో సహా చెప్పగలుగుతున్నారు. వీటిని తల్లిదండ్రులకు కూడా చెప్పేలా ప్రోత్సహిస్తున్నారు. తద్వారా ఆయా కుటుంబాల్లో కూడా కొంత మార్పు వస్తుందన్నది ఆమె ఆలోచన. ఇందులో చదువు విలువ, మూర్ఖుని లక్షణాలు, జ్ఞాన వంతుని లక్షణాలు, మంచి చెడుల మధ్య అంతరం, దేశ భక్తి, తల్లిదండ్రుల సంబంధాలు, మాతృభాష అవశ్యకత, స్త్రీలపై గౌరవభావం తదితర అంశాలున్నాయి.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- పెళ్లే సర్వం, స్వర్గం
- ఘోర అగ్ని ప్రమాదం..32 మంది మృతి
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
