
తాజా వార్తలు
వెదురును ఉపయోగిస్తూ.. పర్యావరణానికి హితం చేయడం ఏమిటనే కదా! సైకిళ్ల తయారీ కోసం ఒక్క వెదురు చెట్టును కొట్టివేస్తే.. అందుకు ప్రతిగా పది వెదురు మొక్కలు నాటుతూ పర్యావరణ సమతౌల్యతకు తమవంతు దోహదం చేస్తున్నారు దపా అండ్ కో.
పిక్కబలం ఉన్నవాడే దూసుకుపోతాడు.. కండబలం ఉన్నవాడు చైన్లాగుతాడు.. సైకిల్‌తో మనకున్న అనుబంధం అలాంటిది! ఒకప్పుడు జీవితంలో భాగమైన సైకిల్.. ఇప్పుడు ఓ వ్యాయామ సాధనంగా మారిపోయింది. పిల్లల ఆటవస్తువైపోయింది. మన దగ్గర ఇలా ఉంటే.. ఘనాలో సైకిళ్లకు ఘనమైన దశ పట్టింది. ఇవి అల్లాటప్పావి కావు. కొత్తగా ఉన్నప్పుడు తొక్కేసి.. ఆపై తుక్కు కింద అమ్మేసే బాపతూ కావు. ప్రకృతి నుంచి పుట్టుకొచ్చిన ద్విచక్రవాహనాలివి. మళ్లీ అదే ప్రకృతిలో కలిసిపోతాయి. వెదురుతో చేసిన సైకిళ్లు.. ఎదురు లేకుండా దూసుకెళ్తున్నాయి. ఘనాకు చెందిన బెర్నీస్ దపా అనే మహిళ పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న సైకిళ్ల తయారీకి శ్రీకారం చుట్టింది. ఇందులో టైర్లు, చైన్ మినహా మిగతా భాగాలన్నీ వెదురుతోనే రూపొందించారు. సైకిల్లో వాడిన వెదురు ఎక్కువ కాలం మన్నేందుకు రకరకాల ప్రక్రియలు చేపడతారు. కొత్త రకం సైకిళ్ల తయారీ కోసం 35 మందికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చింది దపా. వీరిలో కొందరు దివ్యాంగులు కూడా ఉన్నారు. వినియోగదారుల కోరిక మేరకు కస్టమైజ్డ్ సైకిళ్లు కూడా తయారు చేస్తున్నారు వీళ్లు. సోషల్ మీడియా పుణ్యమా అని.. వెదురు సైకిళ్ల కథాకమామీషూ నెట్లో చెక్కర్లు కొడుతోంది. ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు బాన్‌కీమూన్ సైతం బాంబూ సైకిల్‌పై సవారీ చేయడం విశేషం.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- మరోసారి నో చెప్పిన సమంత
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
