Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 136902
            [news_title_telugu_html] => 

337 కొలువుల బంగారు కొండ!

[news_title_telugu] => 337 కొలువుల బంగారు కొండ! [news_title_english] => [news_short_description] => 2.. 2.. 3.. 3.. 4.. 4.. 5.. 5.. విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాల వేళ.. ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు, కళాశాలలు సాధించిన ర్యాంకుల పంటలు అనుకుంటున్నారా? అస్సలు కాదు.. కొందరు సాధించిన కొలువుల సంఖ్యలవి. అలాగని అందరూ కలిసి సాధించిన మొత్తం ఉద్యోగాలూ కాదండోయ్‌! ఒక్కో నిరుద్యోగి అన్నేసి ఉద్యోగాలు సాధించాడు [news_tags_keywords] => education,jobs,abkari,yedukondalu,varevva [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-05 00:29:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
337 కొలువుల బంగారు కొండ! - EENADU
close

తాజా వార్తలు

337 కొలువుల బంగారు కొండ!

2.. 2.. 3.. 3.. 4.. 4.. 5.. 5.. విద్యాసంస్థల్లో విద్యార్థుల ప్రవేశాల వేళ.. ప్రైవేటు కార్పొరేటు పాఠశాలలు, కళాశాలలు సాధించిన ర్యాంకుల పంటలు అనుకుంటున్నారా? అస్సలు కాదు.. కొందరు సాధించిన కొలువుల సంఖ్యలవి. అలాగని అందరూ కలిసి సాధించిన మొత్తం ఉద్యోగాలూ కాదండోయ్‌! ఒక్కో నిరుద్యోగి అన్నేసి ఉద్యోగాలు సాధించాడు మరి ఒక్క ఉద్యోగం సాధించడమే గగనమవుతున్న ఈ పోటీ ప్రపంచంలో..  ఒక్కరు అన్నేసి ఉద్యోగాలను సాధించడమేంటీ? అని ఆశ్చర్యపోతున్నారా?అదంతా ‘ఏడుకొండల’ వారి మహిమ.
యన పేరు ఏడుకొండలు. ఆబ్కారీ శాఖలో అధికారి. ఎంతోమంది ఉద్యోగాలు సాధించడం వెనుక ఆయన స్ఫూర్తి, కృషి, ఉచిత శిక్షణ ఎంతో దాగి ఉంది   ఓ వైపు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే.. మరోవైపు తన సేవా ధర్మాన్ని కొనసాగిస్తున్నారాయన. నిరుద్యోగులంతా ‘విజ్ఞాన సర్వస్వం’గా పిలుస్తున్న ఆయన శిక్షణ ఇచ్చారంటే ఉద్యోగం వచ్చితీరుతుందని ,చాలామంది నమ్ముతారు. ఆయన ఇప్పటి వరకు ఆయన దగ్గర శిక్షణ పొందిన  337 మంది కొలువులు సాధించారు. వారిలో ఎవరిని కదిలించినా.. ఏడుకొండలు చలవే అని మనస్ఫూర్తిగా చెబుతారు.
ఏడుకొండలుది నల్గొండ జిల్లా పెద్దఊర మండలం నాయనవాయికుంట గ్రామం. సాధారణ వ్యవసాయ కుంటుంబం. చిన్ననాడు సగటు విద్యార్థి. ఎనిమిదో తరగతి పూర్తవగానే బడి మానేసి తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లడం ప్రారంభించారు. సంవత్సరం పాటు పాఠశాలకు దూరంగానే ఉన్న తరువాత లీనస్‌ అనే ఉపాధ్యాయుడు.. ఈ డ్రాపవుట్‌ విద్యార్థిని మళ్లీ పాఠశాలలో చేర్పించారు. చదువు విలువ చెప్పి పాఠాలు బోధించారు. అనంతరం పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ పూర్తవగానే 2003లో జైలు వార్డరు ఉద్యోగానికి ఎంపికయ్యారు. విశాఖపట్నంలో జైలు వార్డరుగా విధులు నిర్వర్తిస్తూనే గ్రూప్‌-2 పరీక్షకు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండానే 2007లో ఆబ్కారీ శాఖలో కొలువు సంపాదించారు. నల్గొండలో ఎక్సైజ్‌ ఎస్‌ఐగా నియమితులయ్యారు. తరవాత కొన్ని సంవత్సరాలకు సీఐగా పదోన్నతి పొంది అక్కడే కొనసాగారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో.. ఓ ప్రైవేటు శిక్షణ సంస్థ వారు ఆయన్ను 2015లో అతిథి ఉపన్యాసం ఇవ్వాలంటూ ఆహ్వానించారు. ‘ఉద్యోగం దక్కించుకోవాలన్న కసి, కన్నవారి కలలను సాకారం చేయాలన్న ఆకాంక్ష ఉంటే కొలువు సాధించడం పెద్దకష్టమేమీ కాదం’టూ శిక్షణార్థులకు ప్రేరణ ఇచ్చారాయన. అతని బోధన విధానానికి ఆశ్చర్యపోయిన సన్నిహితుల కోరిక మేరకు.. బీసీ స్టడీ సర్కిల్‌లోని శిక్షణార్థులకు  ఉచితంగా తరగతులు చెప్పారు. ఆ విద్యార్థుల్లో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి.

ఆలోచన అలా...
ఉద్యోగ సాధన కోసం శిక్షణ తీసుకోవడానికి ఆర్థిక స్థోమతలేని వారి పరిస్థితి ఏంటీ? అప్పుడే ఆయన  నిర్ణయం తీసుకున్నారు తానే నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని. ఆలోచన తట్టిందే తడవుగా నల్గొండలో 2016లో ఉచిత శిక్షణను ప్రారంభించారు ఏడుకొండలు. ఉచిత శిక్షణ సంస్థను ప్రారంభించిన కొన్ని రోజులకే 500 మంది చేరారు. రెండు నెలల్లో ఆ సంఖ్య 1000 మంది చేరుకుంది. ప్రతి రోజు ఆయన విధులకు వెళ్లడానికి ముందు ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు, విధులు ముగిసిన అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇవ్వడం దినచర్యగా చేసుకున్నారు. జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ ఎఫైర్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రం తదితర అంశాలపై ఆయనే సొంతంగా మెటీరియల్‌ను సిద్ధం చేసి బోధించేవారు. ఇతని ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వెయ్యి మందిలో తొలి సంవత్సరమే 129 మంది వివిధ ఉద్యోగాలను సాధించారు. ఇలా నల్గొండలో శిక్షణ ఇస్తున్న సమయంలోనే 2017, నవంబరులో ఏడుకొండలుకు నాగర్‌కర్నూల్‌ సీఐగా బదిలీ అయింది. దీంతో శిక్షణ పొందుతున్న వారిలో ఆందోళన మొదలైంది. ఎలాంటి ఆందోళన చెందొద్దని వారికి పూర్తి భరోసా ఇచ్చారు. నాగర్‌కర్నూల్‌ సీఐగా విధుల్లో చేరి.. ఇక్కడ ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే అక్కడి శిక్షణార్థులకు ఆన్‌లైన్‌లో హెచ్‌డీ స్క్రీన్‌ ద్వారా శిక్షణ ఇవ్వడం ప్రాంభించారు. అటు నల్గొండలోని శిక్షణార్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తూనే ఇటు నాగర్‌కర్నూల్‌లో నేరుగా శిక్షణ మొదలుపెట్టారు ఈసారి మరో 80 మందికిపైగా పోలీస్‌ కానిస్టేబుల్‌, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో, ఎఫ్‌బీవో, ఎస్‌ఐ తదితర ఉద్యోగాలను సాధించారు. 2018లోనూ అదే శిక్షణ పంథా అవలంబించారు. ఇటీవల కూడా ఆయన శిక్షణ ఇచ్చిన పది మంది ఎస్సైలుగా కొలువులు సాధించారు


సొంత ఖర్చుతోనే..

ఆ నోటా ఈ నోట.. ఏడుకొండలు ఇస్తున్న శిక్షణ మాట ఇతర జిల్లాలకూ వ్యాపించింది. ఉమ్మడి ఖమ్మం, మెదక్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల నుంచీ నిరుద్యోగులు వచ్చి శిక్షణకు హాజరవుతున్నారు. ప్రైవేటు వసతి గృహాలు, గదులను అద్దెకు తీసుకొని మరీ ఏడుకొండలు ఇస్తున్న శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన 10 పట్టణాల్లో 15 చోట్ల ఆన్‌లైన్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. దీనికయ్యే ఖర్చంతా ఆయనే భరిస్తున్నారు. ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వడానికి హెచ్‌డి తెరలు, ఇతర పరికరాల కోసం రూ. 20 లక్షల ఖర్చయింది. ఈ డబ్బుకోసం రూ. 10 లక్షలను వ్యక్తిగత రుణం తీసుకోవడంతోపాటు రూ. 5 లక్షలను తన జీపీఎఫ్‌ నుంచి సమకూర్చుకున్నారు. విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తానంటే తన తల్లి రూ. 3 లక్షలు, తన సోదరుడు, శ్రీనివాస్‌(ఎస్‌ఐ) రూ. 2 లక్షలను ఆనందంగా అందజేశారు. ఈ మొత్తంతో ఆన్‌లైన్‌ శిక్షణకు అవసరమయ్యే హెచ్‌డీ తెరలు, పరికరాలను కొనుగోలు చేశారు. ప్రతి నెలా రూ. 15,000 ఇంటర్‌నెట్‌ బిల్లు వస్తుంది. ఈ మొత్తాన్ని తనే భరిస్తున్నారు.


- ఏలేటి ప్రభాకర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.