close

తాజా వార్తలు

మైసూరుకు కొత్త ‘గౌరి’వం!

మైసూర్‌ అనగానే చాముండేశ్వరీ ఆలయం గుర్తొస్తుంది, బృందావన్‌గార్డెన్స్‌ కళ్లముందు కదులుతాయి.
ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు చేర్చుకోండి. అది జల్‌బాగ్‌. అదో అద్భుత పర్యావరణహిత ఉద్యానవనం.
ఇది ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందో, స్వచ్ఛంద సంస్థలు నిర్మించిందో కాదు...
ఎవరూ చేయంది ఏదో చేసి చూపాలన్న ఓ యువతి ఆలోచనకు ప్రతిరూపమిది.
ఎన్నో కళారూపాలతో తీర్చిదిద్దిన ఈ ఉద్యానవనం కట్టిపడేయడమే కాదు ఆలోచనలో పడేస్తుంది.

నం అనగానే అంటే పూల తోటలు, ఆకట్టుకునే చెట్లు గుర్తొస్తున్నాయి కదా...
కానీ మైసూరులోని జల్‌బాగ్‌ మాత్రం అనేక కళారూపాలతో నిండి ఉంటుంది.  ఎం.గౌరి అనే యువతి ప్రయత్నానికి ఫలితమిది. ఫైన్‌ ఆర్ట్స్‌లో పీజీ చేసిన ఈమె మొదట ఇసుకతో అనేక కళాఖండాలు రూపొందించి మైసూరులో ఒక మ్యూజియం ఏర్పాటుచేశారు. తరువాత ఇంతకు మించింది ఏదైనా చేయాలని సంకల్పించారు. ఆ ఆలోచనకు ప్రతి రూపమే జల్‌బాగ్‌. కేఎస్‌ఆర్‌ రోడ్డులో, మైసూరుకు పది కిలోమీటర్ల దూరంలో మూడెకరాల స్థలం దీనికోసం ఎంపిక చేసుకున్నారు. నిజానికి ఇదో ముంపు స్థలం. వర్షాలు బాగా పడితే ఇక్కడున్న స్థలాలు నీటమునిగి పోతుంటాయి. పైగా పక్కనే చెరువుకూడా. ఈ ముంపు స్థలాల్లోనే గౌరి ఓ అద్భుత ఉద్యానవనాన్ని చూశారు. అక్కడివారితో మాట్లాడి ఈ స్థలాన్ని లీజుకు తీసుకున్నాను. రూ.1.50 కోట్లతో జల్‌బాగ్‌ నిర్మించారు. ఇందులో చాలాభాగం ఆమె సొంతగానే ఖర్చుచేశారు. కొంత మొత్తాన్ని విరాళాల రూపంలో సేకరించారు. వర్షాకాలంలోగాని వరదల సమయంలోగాని నీరు చేరకుండా చుట్టూ తక్కువ ఎత్తుతో ప్రహరీ ఏర్పాటుచేశారు.  నేలని పూర్తిస్థాయిలో సంస్కరించారు. మెష్‌, ఇనుము, రోప్‌లు, వర్టికల్‌ పాట్స్‌ను ఉపయోగించి పెద్దపెద్ద కళాకృతులు రూపొందించారు. చేప, తాబేలు, నాగుపాము, వృక్షాలు, మైసూరు ప్యాలెస్‌, కావేరిపై కట్టిన సుందరమైన డ్యామ్‌, టీ కెటిల్‌ ఏర్పాటుచేశారు. రెండేళ్ల పాటు ఇరవై మందికిపైగా నిపుణులు దీని ఏర్పాటులో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం ఇది పర్యటకులకు ఓ సందర్శనాస్థలంగా, విద్యార్ధులకు ఎకో ఫ్రెండ్లీ ప్రాంతంగా, స్పూర్తికలిగించే శిక్షణాలయంగా  మారింది.

- జగదీశ్వరి, బెంగళూరు


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.