close

తాజా వార్తలు

Updated : 04/11/2019 01:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీ కావాలా? ప్లాస్టిక్‌ తేవాల!

ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది... ప్లాస్టిక్‌. భూమిలో నిశ్శేషంగా మిగిలిపోయే ఈ వ్యర్థాలు మానవాళికి చేసే కీడు అంతా ఇంతా కాదు. దాని నివారణ కోసం అన్ని దశల్లో తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణ కోసం ఇక్కడ జరుగుతున్న వినూత్న ప్రయత్నం చూడండి...

మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్‌లో ప్లాస్టిక్‌ రహిత సమాజం ముఖ్యాంశం. ఈ స్ఫూర్తితో  కర్ణాటకలోని విజయపుర మునిసిపల్‌ కార్పొరేషన్‌ వినూత్న కార్యక్రమం అమలు చేస్తోంది. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల ఇందిరా క్యాంటీన్లు నడుస్తున్నాయి. నగరంలోని పౌరులు తమ ఇళ్లల్లో ఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఇక్కడ అందజేయొచ్చు.

ఆ...చేస్తే ఏంటి... అనంటారా?

నాలుగు వాడేసిన ప్లాస్టిక్‌ సీసాలను అందజేస్తే ఓ కమ్మటి టీ ఆ క్యాంటీన్లో ఇస్తారు.

దీంతో ప్రస్తుతం నగరంలోని టీ ప్రియులు ఉదయాన్నే ఖాళీ సీసాలతో క్యాంటీన్ల ముందు బారులు తీరుతున్నారు. ఇలా రోజూ 400 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తున్నామని కార్పొరేషన్‌ కమిషనర్‌ హర్షా శెట్టి చెబుతున్నారు.

మరి ఈ సేకరించిన వ్యర్థాలన్నీ కార్పొరేషన్‌ ఏం చేసుకుంటుంది?

దానికీ... ఓ మంచి మార్గం దొరికిందని చెబుతున్నారు అధికారులు. సమీపంలోని బాగల్‌కోట్‌లో ఉన్న జేకే సిమెంట్‌ కర్మాగారంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ వ్యర్థాలను సిమెంటు తయారీలో వాడేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల సిమెంటు నాణ్యత పెరుగుతుందని తేల్చారట.

ఏదేమైనా ప్లాస్టిక్‌ను నగరంలో నుంచి పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారండీ అక్కడి అధికారులు...


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని