close

తాజా వార్తలు

అన్నవరంఆకు మారలేదు!

అన్నవరం గుళ్లో వ్రతం కాగానే

పురోహితులు ప్రసాదం చేతికందిస్తారు...

అదీ సత్యదేవుడి ఆలయానికే గోధుమ నూక ప్రసాదం...

అది ఉండేది అడ్డాకులో...అదేనండీ విస్తరాకులో...

చాలా ఆలయాల్లో లడ్డూ ప్రసాదం... అదీ ప్లాస్లిక్‌ పొట్లాల్లో ఇవ్వడం మనకు తెలుసు. కానీ అన్నవరంలో మాత్రం వందేళ్లుగా ఒకటే సంప్రదాయం. అప్పటికీ, ఇప్పటికీ అదే గోధుమనూక ప్రసాదం, అదే విస్తరాకు పొట్లాలు. ఎంత మందికి ఇవ్వాల్సున్నా సరే... అడ్డాకులు తప్పనిసరి. ఎందుకిలా అంటే... అందులో ప్రసాదం పవిత్రత, రుచిని దాచిన రహస్యం ఉంది లెండి...

సత్యదేవుడి దివ్య ప్రసాదాన్ని గోధుమనూక, పంచదార, నెయ్యి, యాలకులు వేసి తయారు చేస్తారు. దీనికి గాలి తగులుతుండాలి. అలాగైతేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సహజమైన విస్తరాకుల్లో మాత్రమే సూక్ష్మరంధ్రాల ద్వారా గాలి తగులుతుంటుంది. ఆకు వల్ల ప్రసాదంలో నెయ్యి కరిగి కారిపోయే అవకాశం ఉండదు. దీంతో ప్రసాదం నాణ్యంగా, మధురంగా ఉంటుంది. దీంతో అన్నవరం ప్రసాదానికి ప్రత్యేకంగా విస్తరాకులను ఎంచుకున్నారు. పైగా ఆకుల్లోని రసాన్ని పీల్చుకున్న ప్రసాదం మరింత రుచికరంగా మారుతుంది. ఇంత మహత్తరమైంది దీనికి ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల విభాగంలో ఐఎస్‌వో 22000 : 2005 గుర్తింపునిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ధ్రువీకరణ పత్రాన్ని అందించారు.

అంత మందికి చేయూత...

దేవస్థానంలో ఏటా 2 కోట్ల ప్రసాదం పొట్లాలు విక్రయిస్తారు. దీనికోసం నెలకు 20 లక్షల వరకు సిద్ధమైన ఆకులు అవసరమవుతాయి. ఇవన్నీ విశాఖ జిల్లాలోని చింతపల్లి, పెదబయలు, పాడేరు, అరకు, ముంచిగపుట్ట తదితర ప్రాంతాల నుంచి సేకరిస్తారు. దీంతో ఏటా ఆరు నెలల పాటు ఈ ప్రాంతాల్లోని గిరిజనులకు మంచి ఉపాధి దొరుకుతోంది. సేకరించిన అడ్డాకులను పూచికపుల్లతో కుట్టి విస్తరాకుగా కుట్టడం ద్వారా మరికొన్ని గ్రామాల ప్రజలకు పని దొరుకుతోంది.

- పాకలపాటి వెంకటరాజు, అన్నవరం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.