close

తాజా వార్తలు

150 మొబైల్‌ నంబర్లుటక టక టక!

వరసగా ఓ నాలుగు ఫోన్‌ నంబర్లు చెప్పండి...

ఆ... ఆగండి... మొబైల్‌ చూసి కాదు...

అరె... ఎలా చెప్తామండీ బాబూ.. అంటారా...

నిజమే! ఆత్మీయుల నంబర్లు కూడా మొబైల్‌ చూస్తేనేగానీ గుర్తురాని రోజుల్లో మనం ఉన్నాం కదా. ఓసారి ఈయన గురించి వినండి...

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం నెమిలలోని ఈ 72 సంవత్సరాల వృద్ధుడు మాత్రం చాలా ప్రత్యేకం. ఆయన పేరు జీడిపల్లి రాజిరెడ్ఢి చదివింది కేవలం ఐదో తరగతే అయినా ఏకబిగిన 150 చరవాణి నంబర్లను చూడకుండా చెబుతుంటారు. తన చరవాణిలో ఇప్పటివరకు ఒక్క నంబరు కూడా నమోదు చేసుకోలేదు. కానీ తనకు కావాల్సిన వాళ్లందరి నంబర్లను గుర్తుపెట్టేసుకుని చెప్పేస్తుంటాడు. జిల్లా ఉన్నతాధికారులు మొదలుకుని ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకుల నంబర్లను చెబుతుంటే ఆశ్చర్యంతో వినడం మనవంతవుతుంది.

రాజిరెడ్డిది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఆయనకున్న మూడు ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటాడు. పక్షవాతానికి గురైన రాజిరెడ్డి ఊతకర్ర సాయంతోనే ఇల్లు కదలాలి. లేదా అవసరమైన పనుల కోసం ఫోన్లలో పురమాయించాలి. దీంతో వ్యవసాయం, ఇతర పనులకు ఉపయోగపడే వారి నంబర్లు గుర్తుపెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు. అలా సాధనతో వందల నంబర్లు ఆయన మస్తిష్కంలోకి చేరిపోయాయి. చరవాణి నంబర్లే కాదు పేర్లు, పుట్టిన తేదీలు కూడా గుర్తు పెట్టుకుని మరీ చెబుతుంటారు. చిన్న వయస్సు నుంచి ఒకసారి మననం చేసుకుంటే అలాగే గుర్తుండి పోతుందని రాజిరెడ్డి చెబుతుంటారు. ఇప్పుడైతే ఎంత పెద్ద నంబర్లయినా ఒకసారి చూసుకుని ఎప్పుడడిగినా చెప్పగలను అంటున్నారాయన. గ్రామంలో ఏ ఆపద సమయంలోనైనా అత్యవసరంగా ఎవరి చరవాణి నంబరు కావాలన్నా ఈయనను అడిగి నమోదు చేసుకుంటారు స్థానికులు.

-ఎక్కలదేవి వెంకటేశ్వర్లు, రాజపేట


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.