close

తాజా వార్తలు

అమ్మలారా...

‘స్త్రీ’ మూర్తిలో మానవతామూర్తిని దర్శించమని సందేశం ఇచ్చారు ప్రభువు. మహిళలను మహిళలను ఎలా గౌరవంగా చూసుకోవాలో క్రీస్తు తాను ఆచరించి ప్రపంచానికి చాటారు. ప్రభువు జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలే ఈ విషయాలను తేటతెల్లం చేస్తాయి. మహిళల విషయంలో ఎలా ప్రవర్తించాలో బోధిస్తాయి.

క్రీస్తు ప్రభువు తల్లి మేరీమాత ఒక పేద యూద స్త్రీ. దైవ నిర్ణయం మేరకు యేసుక్రీస్తుకు జన్మనిచ్చే క్రమంలో ఆమె చూపిన ఆత్మస్థైర్యం కొనియాడ తగినది. ఆమె ప్రసవించే సమయంలో కనీస వసతి లేదు. ఒక పశువుల పాకలో దైవకుమారుడికి జన్మనిచ్చారు. నాటి నియంత హేరోదు చక్రవర్తి నుంచి బాలయేసును రక్షించడానికి ఆమె ఈజిప్టు దేశానికి రహస్యంగా తరలి వెళ్లారు. దీనుల పాప పరిహారార్థం సిలువపై బలియాగం చెందిన క్రీస్తుప్రభువు మరణాన్ని తట్టుకొని నిలబడ్డారు. అందుకే మేరీమాత గొప్ప మాతృమూర్తిగా నిలిచింది.

ప్రభువు శిష్యులు పన్నెండు మందితో పాటు, ఆయన అనుచరగణంలో కొందరు స్త్రీమూర్తులూ ఉండేవారు. వారిలో ముఖ్యురాలు.. ‘ముగ్దల’ గ్రామానికి చెందిన మరియ. ఆమెను మాగ్దలీవ్‌ మరియ అని పిలిచేవారు. యేసు బోధనలు సాగించే సమయంలో ఆయన వెంటే ఉండేవారామె. శిష్యులకు ఏం కావాలో చూసుకునేది. క్రీస్తును సిలువ వేసిన సమయంలో యోహాను తప్ప మిగతా శిష్యులంతా పారిపోయినా.. ఆమె మాత్రం సిలువ నీడలోనే ఉండిపోయారు. ఆమె విశ్వాసం యథార్థమైనది. పసిమనసు లాంటి ఆమె విధేయతను, యేసు గౌరవించి ఆమెకు పునరుత్థాన సమయంలో మొదటిసారి కనిపించాడు.
యేసు జీవితంలో తారసపడిన మరో అద్భుతమైన వ్యక్తి సమరయ స్త్రీ. ఆమె సమాజం వెలివేసిన, దగాపడిన వెలయాలు. క్రీస్తు ప్రభువు ఆమెతో మాట్లాడటం, దాహానికి నీరు ఇమ్మని అడగడం చూసి ఆ ప్రాంతవాసులు అవాక్కయ్యారు.తిరిగి వెళ్లిన ఆమె తమ గ్రామం మొత్తాన్ని ఆయన వైపు నడిపించింది.
పాపం చేస్తూ పట్టుబడిన ఓ మహిళను రాళ్లతో కొట్టాలనే శిక్షను విధించారు ఆనాటి చాంధసులు. అప్పుడు ప్రభువు ‘మీలో పాపం చేయని వాళ్లే ఈ శిక్ష విధించాలి’ అని.. స్త్రీ సంస్కరణకు, వారి సంరక్షణకు దిశానిర్దేశం చేశారు.

- ఎం.సుగుణరావు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.