close

తాజా వార్తలు

దిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) రేట్లు తగ్గే అవకాశముందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా అన్నారు. త్వరలోనే దీనిపై కీలక ప్రకటన వెలువడనున్నట్లు వెల్లడించారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వరంలో దిల్లీలో ఓ కార్యక్రమం జరిగింది. దీనిపై హాజరైన శుక్లా.. జీఎస్‌టీ గురించి ప్రస్తావించారు. ‘జీఎస్‌టీ రేట్లను హేతుబద్ధీకరించే దిశగా జీఎస్టీ మండలి చర్యలు చేపట్టింది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేయనుంది’ అని శుక్లా తెలిపారు.

అన్ని రకాల వస్తువులను, సేవలను ఒకే పన్ను విధానంలోకి తీసుకొచ్చేందుకు గతేడాది జులైలో కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. వస్తువులు, సేవలపై 5, 12, 18, 28 శాతం పన్నులు విధిస్తోంది. అయితే జీఎస్‌టీ విధానాన్ని సరళీకరించాలని, రేట్లను తగ్గించాలని సీఐఐ సహా పలు పారిశ్రామిక వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

కాగా.. ఈ ఏడాది జనవరిలో జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో 54 సేవలు, 29 వస్తువులపై జీఎస్‌టీని తగ్గించిన విషయం తెలిసిందే. అంతకుముందు 2017 నవంబరులో జరిగిన సమావేశంలోనూ 28శాతం శ్లాబులో ఉన్న 178 వస్తువులను కింది శ్లాబులకు తగ్గించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.