close

తాజా వార్తలు

అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పే

ప్రధాని కార్యక్రమ బందోబస్తుకు వెళ్లివస్తుండగా ఘటన

వారణాసి: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ గుంపు రాళ్లతో దాడి చేయగా పోలీసు కానిస్టేబుల్‌ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ప్రధాని సభకు వెళ్లేందుకు పోలీసులు తమను అనుమతించకపోవడంపై ఆగ్రహించిన నిషాద్‌ పార్టీ కార్యకర్తలు ఆ సభ నుంచి తిరిగి వస్తున్న అన్ని వాహనాలపై రాళ్లు విసరడం ప్రారంభించారు. ప్రధాని కార్యక్రమంలో బందోబస్తు విధుల్లో పాల్గొన్న సురేష్‌ వత్స (48) అనే కానిస్టేబుల్‌ తన సహచరులతో కలిసి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ పరిణామం జరిగింది. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసు బృందం ప్రయత్నించింది. రెచ్చిపోయిన కార్యకర్తలు రాళ్లు, కర్రలతో పోలీసులపైనా దాడికి దిగారు. వత్స ఆసుపత్రికి తరలించేసరికే ప్రాణాలు కోల్పోయారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.