close

తాజా వార్తలు

భాజపా ఓటమిపాలైనా మేల్కోవట్లేదు: శివసేన

కుంభకర్ణుడిలా నిద్రపోతోంది

భాజపా ఓటమిపాలైనా మేల్కోవట్లేదు: శివసేన

ముంబయి(మహారాష్ట్ర): మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ భారతీయ జనతా పార్టీ మేల్కోలేదని, అయోధ్యలో రామ మందిర నిర్మాణ విషయంపై స్పందించడం లేదని శివసేన విమర్శలు చేసింది. ‘ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌.. భగవద్గీతలోని ఓ విషయాన్ని తెలిపారు. ‘నేను’ చేస్తున్నదే గొప్ప, నేనే చేశాను.. అని చెప్పుకుంటూ అహంభావం ప్రదర్శిస్తే ఏం ఉపయోగం? అని తెలిపారు. ఆయన ఈ విషయాన్ని చెప్పి భాజపాకి మార్గదర్శకాలు సూచించారు. కానీ, లాభం ఏంటి? కేంద్ర ప్రభుత్వం కుంభకర్ణుడి వంటిది (ఎల్లప్పుడూ నిద్రపోతుంది). మూడు రాష్ట్రాల ఎన్నికల్లో అవమానకర రీతిలో ఓడిపోయినప్పటికీ మేల్కోవడానికి సిద్ధంగా లేదు’ అని తమ పార్టీ పత్రిక సామ్నాలో విమర్శిస్తూ ఓ కథనం ప్రచురించింది. 

‘దేశ ప్రజలందరూ అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని కోరుకుంటున్నారు. అందుకే 2014లో భారతీయ జనతా పార్టీని గెలిపించారు. ఇప్పుడు మందిర అంశం మరోసారి ఆ పార్టీకి ప్రజలను ఆకర్షించే విషయంగా మార్చుకుంటోంది. మందిర నిర్మాణ విషయం గురించి ఆ పార్టీపై చాలా ఒత్తిడి ఉంది. ఆ పార్టీ పాల్గొంటున్న అన్ని సమావేశాల్లోనూ ఈ విషయంపై ప్రశ్నలు వస్తున్నాయి. కానీ, ఆ పార్టీ అధిష్ఠానం వద్ద దీనిపై సమాధానాలు లేవు. ఆ పార్టీలో అంతర్గతంగా సమస్యలు ఉన్నాయి. వారికి సరైన ప్రణాళికలు లేవు’ అని శివసేన విమర్శించింది. కాగా, ఓ వైపు ఆ పార్టీ తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నప్పటికీ భాజపా అధిష్ఠానం మాత్రం శివసేనతో మిత్రత్వాన్ని కొనసాగిస్తామనే చెబుతోంది.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.