close

తాజా వార్తలు

రవిశాస్త్రి సాకులు వెతుక్కోవడంలో బిజీ

టీమిండియా కోచ్‌పై మండిపడుతున్న నెటిజన్లు

రవిశాస్త్రి సాకులు వెతుక్కోవడంలో బిజీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి నోరు జారడం.. నెటిజన్ల చేతికి చిక్కడం ఇది వరకు ఎన్నోసార్లు జరిగింది. తాజాగా మరోసారి రవిశాస్త్రిని నెటిజన్లు టార్గెట్‌ చేశారు. పెర్త్‌ టెస్టు నుంచి స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ను తీసుకోకపోవడంపై ఇప్పటికే వివాదాల్లో మునిగి తేలుతున్న రవిశాస్త్రి ఇప్పుడు మరోసారి నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు. జడేజాకు పూర్తి ఫిట్‌నెస్ లేకనే పెర్త్‌ టెస్టుకు ఎంపిక చేయలేదని రవిశాస్త్రి వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చెప్పిన సమాధానం సమంజసంగా లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విటర్‌ వేదికగా ఆయనపై విమర్శల దాడి చేస్తున్నారు.

* ‘మ్యాచ్‌ల్లో విఫలమైన ప్రతిసారీ సాకులు వెతుక్కోవడానికే ముందుంటారు. జడేజాకు గాయమైతే అతడిని ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి? పృథ్వీ షాను పంపినట్లు జడేజాను కూడా స్వదేశానికి పంపేయచ్చు కదా!’.

* ‘జడేజా ఫిట్‌నెస్‌పై అంత శ్రద్ధ చూపేవాళ్లు నం.12గా అతడిని ఎందుకు తెచ్చారు? జడేజాకు గాయమైతే..కుల్‌దీప్‌ ఉన్నాడుగా. రెండో టెస్టుకు అతడిని ఎందుకు తీసుకోలేదు?’

* ‘కోచ్‌ అని చెప్పుకొని తిరిగే రవిశాస్త్రికి ఆ లక్షణాలే లేవు. జడేజా ఫిట్‌నెస్‌ బాగలేకపోతే అతడితో నెట్స్‌లో ఎందుకు ఫీల్డింగ్‌ చేయించారు. రెండో టెస్టులో నం.12గా ఎందుకు తెచ్చారు. తనకి విశ్రాంతి ఎందుకివ్వలేదు?. సాకులు చెప్పకుండా నిజాలు చెప్పండి’.

* ‘మీరు ఏది చెప్పినా నమ్మేయడానికి క్రికెట్‌ అభిమానులు పిచ్చివాళ్లు కాదు. అందరూ అన్నీ గమనిస్తుంటారు. జట్టు కూర్పు విషయంలో ఎవరినైనా సలహా అడిగితే మంచిది. ఇగో తగ్గించుకోండి. అందరూ చెప్పేది వినండి’.  అని కామెంట్లు పెడుతున్నారు.

‘జడేజా భారత్‌లో దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నపుడే ఫిట్‌నెస్‌తో బాధపడ్డాడు. ఆస్ట్రేలియాకు వచ్చాక కూడా అలాగే ఉండటంతో వైద్యం చేయించుకున్నాడు. ఆ ప్రభావం నుంచి కుదురుకోవడానికి సమయం పట్టింది. మేం అనుకున్నదాని కంటే కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. పెర్త్‌ టెస్టుకు ముందు అతను 70-80 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు అనిపించింది. అందుకే ఆ మ్యాచ్‌లో ఆడించే సాహసం చేయలేదు. మూడో టెస్టుకు 80 శాతం ఫిట్‌నెస్‌తో ఉంటే జడేజాను ఆడిస్తాం’ అని రవిశాస్త్రి అనడంతో వివాదం రేగింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.