close

తాజా వార్తలు

రథయాత్రపై సుప్రీంకు వెళ్లిన భాజపా

రథయాత్రపై సుప్రీంకు వెళ్లిన భాజపా

కోల్‌కతా: పశ్చిమ్ బంగాలో చేపట్టాలనుకుంటున్న రథయాత్రకు అనుమతి కోరుతూ భాజపా రాష్ట్ర విభాగం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అ అంశంపై వేసిన పిటిషన్‌ను వెంటనే విచారించాలని కోరింది. గతంలో ఏకసభ్య ధర్మాసనం రథయాత్రకు అనుమతినిస్తూ ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు డివిజనల్ బెంచ్ పక్కన పెట్టింది. ఆ నేపథ్యంలో దాన్ని సవాలు చేస్తూ భాజపా సుప్రీంను ఆశ్రయించింది. ఆ పిటిషన్‌ను పరిశీలిస్తున్నామని సుప్రీం రిజిస్ట్రీ అధికారి ఒకరు వెల్లడించారు. సమస్యలు సృష్టిస్తుందన్న అనుమానంతో తృణమూల్ కాంగ్రెస్‌ భాజపా రథయాత్రను అడ్డుకుంటుదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ విమర్శించారు. డిసెంబరు 28 నుంచి 31 మధ్యలో ఈ రథయాత్రను నిర్వహించేలా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మరోసారి షెడ్యూల్ మార్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజవర్గాల్లో ప్రచారం నిర్వహించాలన్న భాజపా ప్రణాళికకు డివిజనల్ బెంచ్ ఆదేశాలతో అడ్డంకి ఏర్పడింది.  

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.