close

తాజా వార్తలు

‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌కు విశేష స్పందన

యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నం.1

‘వినయ విధేయ రామ’ ట్రైలర్‌కు విశేష స్పందన

హైదరాబాద్‌: రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. 24 గంటల్లో 7.7 మిలియన్‌ వ్యూస్‌ను దక్కించుకుందని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ప్రచార చిత్రాన్ని యూట్యూబ్‌లో మొత్తం 88 లక్షల మందికిపైగా చూశారు. అంతేకాదు ఇది ట్రెండింగ్‌లో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. రామ్‌చరణ్‌ లుక్, యాక్షన్‌‌ చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేశారు.

బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్‌, స్నేహ, ఆర్యన్‌ రాజేశ్‌, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరోపక్క చరణ్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో నటిస్తున్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌ మరో కథానాయకుడు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. దానయ్య నిర్మాత. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో కథానాయికల వివరాలను ప్రకటించలేదు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.