close

తాజా వార్తలు

నాదేం లేదు.. ఇదంతా ఆయన గొప్పే: రజనీకాంత్‌

‘అభిమానుల సంతోషమే నా సంతోషం’

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘పేట’ సినిమా క్రెడిట్‌ మొత్తం దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజ్‌కు ఇచ్చారు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా మంచి టాక్‌ అందుకుని బాక్సాఫీసు వద్ద కూడా విజయం సాధించింది. కాగా విహారయాత్ర నిమిత్తం డిసెంబరు 22న అమెరికా వెళ్లిన రజనీ గురువారం తిరిగి చెన్నై వచ్చారు. ఈ సందర్భంగా ‘పేట’ విజయం గురించి విమానాశ్రయంలో విలేకరులు తలైవాను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఈ విజయానికి కారణం సుబ్బరాజ్‌ అన్నారు. ‘‘పేట’ సినిమా ప్రేక్షకులకు నచ్చిందని తెలిసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అభిమానుల సంతోషమే నా సంతోషం. ఈ ప్రశంసలన్నీ కార్తిక్‌ సుబ్బరాజ్‌కే దక్కుతాయి. నేను ఇంకా బాగా నటించానని అందరూ నా ప్రస్తావన తీసుకొస్తున్నారు, నాదేం లేదు. ప్రతి ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ అని రజనీ అన్నారు.

‘‘పేట’కు లభించిన అద్భుతమైన స్పందన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ధన్యవాదాలు తలైవా ఫ్యాన్స్‌. లవ్‌ యు తలైవా... సన్‌ పిక్చర్స్‌, మొత్తం చిత్ర బృందానికి కృతజ్ఞతలు. దయచేసి సినిమా థియేటర్‌లో తీసిన ఫొటోలను, వీడియోలను షేర్‌ చేయొద్దు. కథను బయటపెట్టొద్దు. ప్రతి ఒక్కర్నీ సినిమా చూడనివ్వండి’ అని కార్తిక్‌ సుబ్బరాజ్‌ ఈ సినిమాను ఉద్దేశించి గురువారం ట్వీట్‌ చేశారు.

‘పేట’ సినిమాలో త్రిష, సిమ్రన్‌ కథానాయికల పాత్రలు పోషించారు. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. విజ‌య్‌ సేతుప‌తి, బాబీ సింహా, మేఘా ఆకాష్, యోగిబాబు త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్‌ బాణీలు అందించారు. క‌ళానిధి మార‌న్‌, అశోక్ వ‌ల్ల‌భ‌నేని నిర్మించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.