close

తాజా వార్తలు

తొలి వన్డేకు పాండ్య స్థానంలో జడేజా?

కోహ్లీ ఏమన్నాడంటే..!

సిడ్నీ: ఆసీస్‌తో శనివారం జరగబోయే తొలి వన్డేకు టీమిండియా జట్టును ఇప్పటివరకు ఎంపిక చేయలేదు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌లపై నిషేధం పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్య స్థానంలో రవీంద్ర జడేజాను తీసుకోనున్నారట. టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ మనసులోనూ ఇదే ఉందని తెలుస్తోంది. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో కోహ్లీ ఈ విషయాన్ని ప్రస్తావించాడు. బీసీసీఐ తీర్పు కోసం ఎదురుచూస్తున్నామని, ఒక వేళ పాండ్య మీద నిషేధం పడినట్లయితే జడేజాను తీసుకునే అవకాశాలున్నాయని నర్మగర్భంగా చెప్పుకొచ్చాడు.

భారత జట్టు(అంచనా1): రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోనీ, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌, ఖలీల్ అహ్మద్‌.

అంచనా2: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్, ఎంస్‌ ధోని, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహమ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్‌.

అంచనా3: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, అంబటి రాయుడు,  ఎంస్‌ ధోని, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, ఖలీల్ అహ్మద్‌, మహమ్మద్‌ షమీ.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.