close

తాజా వార్తలు

17 నెలల కనిష్ఠానికి పారిశ్రామిక ఉత్పత్తి

దిల్లీ: పారిశ్రామికోత్పత్తి వృద్ధి 17 నెలల కనిష్ఠానికి దిగజారింది. తయారీ రంగంలో ఒడుదొడుకులు ఎదురుకావడంతో నవంబర్‌లో వృద్ధి 0.5 శాతంగా నమోదైంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా ఫ్యాక్టరీ ఔట్‌పుట్‌ 2017 నవంబర్‌లో 8.5 శాతం ఉందని కేంద్ర గణాంక కార్యాలయం తెలిపింది. అంతకు ముందు కనిష్ఠ వృద్ధిరేటు 0.3 శాతం 2017 జూన్‌లో నమోదైంది. ఇక 2018 అక్టోబర్‌ వృద్ధిని 8.4 శాతం 8.1 శాతానికి సవరించారు.

అంతకుముందు ఏడాది 3.2 శాతం పారిశ్రామిక ఉత్పత్తితో పోలిస్తే 2018 ఏప్రిల్‌-నవంబర్‌ కాలంలో 5 శాతం వృద్ధి నమోదైంది. ఐఐపీలో 77.63 శాతం ఆక్రమించే తయారీ రంగం అంతకుముందు 10.4 శాతంతో పోలిస్తే నవంబర్‌లో 0.4 శాతం తగ్గింది. మైనింగ్‌ రంగం 2017 నవంబర్లో 1.4 శాతం వృద్ధితో ఉండగా 2018లో మాత్రం 2.7 శాతంతో దూసుకుపోయింది. విద్యుత్‌ రంగం 3.9 శాతం నుంచి 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది. క్యాపిటల్‌ గూడ్స్‌ వృద్ధి 3.7 శాతం నుంచి 3.4 శాతానికి తగ్గింది. ఎక్కువ కాలం మన్నికగా ఉండే వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి 3.1 శాతం నుంచి 0.9 శాతం తగ్గింది. మన్నిక లేని వస్తువుల ఉత్పత్తి 23.7 శాతం నుంచి 0.6 శాతం తగ్గింది. తయారీ రంగంలోని 23 పరిశ్రమల్లో 10 నవంబర్‌ (2018)లో సానుకూల వృద్ధి నమోదు చేయడం గమనార్హం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

ఈటీవీ స్పెషల్

దేవతార్చన

రుచులు

© 1999 - 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions | Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.