close

తాజా వార్తలు

‘ఆక్వామెన్‌’ స్టన్నింగ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ చూశారా?

‘ఆక్వామెన్‌’ స్టన్నింగ్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ చూశారా?

లాస్‌ఏంజెల్స్‌: సూపర్‌ హీరో చిత్రం ‘ఆక్వామెన్‌’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.7వేల కోట్లకు పైగా వసూలు చేసింది. జేమ్స్‌ వాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాసన్‌ మెమోవా, అంబర్‌ హియర్డ్‌‌‌, ప్యాట్రిక్‌ విల్సన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వార్నర్‌ బ్రదర్స్‌, డీసీ ఫిల్మ్స్‌ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ఏడు రాజ్యాల మధ్య జరిగే యుద్ధాన్ని ఈ సినిమాలో ఉత్కంఠ భరితంగా చూపించారు.

‘ఆక్వామన్‌’ చిత్రం కోసం ఊహకందని ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. తాజాగా ‘ఆక్వామెన్‌: విజువల్‌ ఎఫెక్ట్స్‌ బిఫోర్‌, ఆఫ్టర్‌’ పేరుతో చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. గతంలో ఏ చిత్రంలోనూ చూడనటువంటి అద్భుతమైన సన్నివేశాలను వీఎఫ్‌ఎక్స్‌లో సృష్టించారు. దర్శకుడి ఊహలకు అనుగుణంగా వీఎఫ్‌ఎక్స్‌ బృందం ఎంత కష్టపడిందీ ఈ వీడియోలో తెలుస్తోంది. మీరూ ఆ వీడియోను చూసేయండి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.